హన్మకొండ ;

హనుమకొండ జిల్లాలోని దేవునూర్, ముప్పారం పరిధిలో నోటిఫై చేసిన ఫారెస్ట్ భూముల సర్వే ప్రక్రియను అధికారులు త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య రెవెన్యూ, అటవీ, ల్యాండ్ సర్వే అధికారులను ఆదేశించారు. బుధవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూరు, ముప్పారం పరిధిలో నోటిఫై చేసిన ఫారెస్ట్ భూముల సర్వేను ఆయా శాఖల అధికారులు చేపట్టిన సర్వే ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే వివరాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. నోటిఫై చేసిన ఫారెస్ట్ భూముల పరిధిలో ఎంత మంది రైతులు ఉన్నారు, ఎంత విస్తీర్ణం సాగవుతున్న వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సాగులో ఉన్న పలువురు రైతులు అక్కడికి రాగా కలెక్టర్ వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ సర్వేకు రైతులు సహకరించాలన్నారు. భూముల విషయంలో రైతులకు న్యాయం జరిగేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఫారెస్ట్ భూములు, రెవెన్యూ భూములు గుర్తించేందుకు చేపట్టిన సర్వేను ఆయా శాఖల అధికారులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, స్థానిక తహసీల్దార్ సదానందం, ఫారెస్ట్, సర్వే అధికారులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: