హన్మకొండ ;

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ, మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలను  జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి బుధవారం పరిశీలించారు. విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. అదేవిధంగా గూడూరు లోని  ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  అదనపు కలెక్టర్  పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి  డాక్టర్ అప్పయ్య, స్థానిక తహసీల్దార్ సురేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: