హన్మకొండ ;

 హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో డీఆర్డీఏ, మహిళా స్యయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్  భవనాన్ని జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య బుధవారం పరిశీలించారు. 

సహకార శాఖ కు సంబంధించిన భవన సముదాయంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను నెలకొల్పేందుకు నిర్ణయించగా అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. 

ఈ సందర్భంగా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను ఆయా శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు కు అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

ఈ కార్యక్రమంలో డీఆర్డీవో మేన శ్రీను, ఎంపీడీవో అనీల్ కుమార్, డీపీఎం జన్ను ప్రకాష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి

 ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు.

బుధవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ లోని శ్రీవినాయక రైస్ మిల్లు ను కలెక్టర్ పరీశీలించారు. 

ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా మిల్లుకు వచ్చిన సన్న, దొడ్డు రకాల ధాన్యం, పట్టిన బియ్యం,  ధాన్యం తరలింపు, తేమ శాతం, గన్నీ సంచులు, తదితర వివరాలను అధికారులు, నిర్వాహకులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు, మిల్లులకు తరలింపునకు సంబంధించిన అంశాలను గురించి అధికారులు, నిర్వాహకులకు కలెక్టర్ పలు సలహాలు, సూచనలు చేశారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: