హన్మకొండ ;
వరదలు వచ్చినప్పుడు గానీ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కానీ, ఎవరైనా నీటిలో మునిగినప్పుడు ఎలా కాపాడాల నే విషయంపై పౌరులందరికీ అవగాహన కల్పించాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం హనుమకొండలోని వడ్డేపల్లి చెరువు దగ్గర ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు పౌరులను ఎలా కాపాడాలనే విషయంపై ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం మాకు డ్రిల్ నిర్వహించింది.ఈ మాక్ డ్రిల్ లో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అగ్నిమాపక శాఖ, పోలీస్ శాఖ, మునిసిపల్ డి ఆర్ ఎఫ్ బృందాలు వారి శాఖల ద్వారా ఏవైనా విపత్తులు సంభవించినప్పుడు సామాన్య ప్రజలను ఎలా కాపాడాలనే విషయంపై అందరికీ అవగాహన కల్పించాలని అన్నారు.విపత్తుల సంభవించినప్పుడు ప్రజలు తమంతట తామే రక్షించుకునే విధంగా వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి అప్పయ్య,జిల్లా మత్స్యశాఖ అధికారి నాగమణి, అగ్నిమాపక శాఖ అధికారి జయపాల్ రెడ్డి, జి డబ్ల్యూ ఎం సి మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: