హన్మకొండ ;
బాలలు సోషల్ మీడియా కు ఎంతదూరంగా ఉంటే అంతమంచిదని, అందుకే సోషల్ మీడియా కు దూరంగా ఉండాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు.
శనివారం హనుమకొండ లోని కాళోజీ కళాక్షేత్రంలో బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లాస్థాయి బాలల దినోత్సవ వేడుకలను పిల్లలు, మహిళలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ ఈ సంవత్సరం బాలల హక్కుల థీమ్ “బాలల భవిష్యత్తు కొరకు బాలల హక్కుల కొరకై నిలబడదాం” అని తెలియజేస్తూ బాలలకు హెల్త్ అండ్ సేఫ్టీ గురించి, చైల్డ్ హెల్ప్ లైన్ -1098 సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. బాలలందరూ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ బాలల హక్కుల వారోత్సవాలలో నిర్వహించే పలు కార్యక్రమాలు బాలలకు వారి హక్కులపై అవగాహన కలిగిస్తాయని అన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య మాట్లాడుతూ చిల్డ్రన్స్ డే సందర్భంగా బాలలకు శుభాకాంక్షలు తెలిపి హనుమకొండ జిల్లాలోని వివిధ సిసిఐ బాలలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.
అలాగే గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి మాట్లాడుతూ బాలలలో ఉన్న ప్రతిభను వెలికితీస్తే అద్భుతాలు చేయగలరని తెలిపారు.
కార్యక్రమానికి ముందుగా ముఖ్య అతిథులతో జ్యోతి ప్రజ్వలన గావించారు
ఈ సందర్భంగా ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో రెండవ స్థానం పొందిన అర్జున్ ను ఘనంగా సన్మానించారు.
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల కు చెక్కులను అందజేశారు
ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా సంక్షేమ అధికారి జయంతి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర ఈసీ మెంబర్ ఇవి. శ్రీనివాస్, కార్పొరేటర్ రావుల కోమల, ప్రాజెక్టు లెవెల్ సిడిపిఓలు స్వాతి, భాగ్యలక్ష్మి, సి డబ్ల్యూ సి మెంబర్స్, జిల్లా సంక్షేమాధికారి కార్యాలయ సిబ్బంది, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బాల సదనాల నిర్వాహకులు, చైల్డ్ లైన్, డిసిపియు సిబ్బంది, అంగన్వాడీ టీచర్స్, అంగన్ వాడి పిల్లలు, వివిధ పాఠశాలల నుండి 800 మంది చిన్నారులు పాల్గొన్నారు.
Post A Comment: