ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
స్పర్శ్ కుష్టు వ్యాధి నిర్మూలన పక్షోత్సవాల సందర్భంగా శుక్రవారం హనుమకొండ జిల్లా పద్మాక్షి గుట్ట వద్ద ఉన్న ఆనంద నగర్ లోని లెప్రసి కాలనీలో కుష్టు వ్యాధి పై అవగాహన సమావేశం జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మదన్ మోహన్ రావు అధ్యక్షతన జరిగింది. ఇట్టి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాలందరు లెప్రసీ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని శరీరంపై తెల్లని, ఎర్రని, మొద్దు బారిన మచ్చలు ఉంటే దగ్గర్లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం నకు వెళ్లి వైద్య సిబ్బందికి చూపించు కోవాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇట్టి కార్యక్రమంలో లెప్రసీ రోగులకు 25 మందికి జిల్లా కుష్టు వ్యాధి నిర్మూలన అధికారి డాక్టర్ మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో దుప్పట్లు, పండ్లు, బెడ్స్, స్టీలు పల్లాలు, సెల్ఫ్ కేర్ కిట్స్ మొదలగునవి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా డిహెచ్ఈఓ సందెల శ్రీనివాస్ కాలనీవాసులకు అనేక ఆరోగ్య సూచనలు వివరిస్తూ లెప్రసీ వ్యాధి పూర్తిగా నయం అగు వ్యాధి అని వ్యాధిని తొందరగా గుర్తించి చికిత్చ తీసుకున్నట్లైతే వ్యాధి ద్వారా వచ్చే అంగవైకల్యాలను అరికట్టవచ్చు అని వివరించారు. రోగులకు ఇచ్చిన దుప్పట్లు, మిగతా వాటికి రిటైర్డ్ డిపిఎంఓ కే. దేవవరం తన వంతుగా సహాయం (దాతృత్వం) చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక డాక్టర్ మౌనిక, డాక్టర్ మోహన్, డిపిఎంఓ లు సతీష్ రెడ్డి, కొమరయ్య, సువార్తి, రవీందర్, బుచ్చి నర్సయ్య, ఏఎన్‌ఎం లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Post A Comment: