ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయశాఖ ఉద్యోగులు న్యాయ సేవాధికార సంస్థ, వరంగల్ మరియు హనుమకొండ జిల్లాలు సంయుక్తంగా "న్యాయ సేవా సదన్ బిల్డింగ్" లో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమంలో సుమారు 183 మంది న్యాయశాఖ ఉద్యోగులు పాల్గొని కంటి పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు, అవసరమైన వారికి 86-అద్దాలు (కళ్ళజోళ్ళు) అందించడం జరిగింది.
ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు కే.రాధాదేవి మరియు ఎం.కృష్ణమూర్తి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు ఎం.వెంకటేశ్వరరావు, వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జే.ఉపేందర్ రావు, హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇంఛార్జి కార్యదర్శి బి.శ్రీనివాసులు, చండీశ్వరీ దేవి, హన్మకొండ జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు, డాక్టర్ మదన్మోహన్రావు (అడిషనల్ డి.ఎం.&హెచ్.ఓ.), డాక్టర్ పి మల్లికా, డాక్టర్ హరిత, గోవర్ధన్ రెడ్డి (సూపర్వైజర్) ఈ కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Post A Comment: