మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గత వారం రోజులుగా కుందనపల్లి యాష్పండుకు చెందిన టిప్పర్ లారీ డ్రైవర్ల సమ్మె ఓ కొలిక్కి వచ్చింది. బిజెపి నేత కార్మిక నాయకుడు కౌశిక హరి ఆదేశాల మేరకు శాతవాహన మల్టిపుల్ మోటర్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో నెల రోజులుగా లారీ యజమానులకు డిమాండ్ నోటీసు తమ వేతనాలు పెరగాలని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే అందుకు జరిగిన చర్చలు విఫలం కావడంతో 27-1-2023 నుండి సమ్మెకు దిగిన లారీ డ్రైవర్లు వారం రోజులుగా సమ్మె నిర్వహించడం జరిగింది. అయితే చర్చలు జరపడానికి ఒక నిర్ణయానికి వచ్చిన లారీ యజమానుల సంఘం నాయకులు కౌశిక హరి తో చర్చలు జరపగా లారీ డ్రైవర్ల అభిప్రాయం మేరకు 1200 ఉన్న రోజువారి కూలీని 1450 కి చేర్చుతున్నట్టు అలాగే డ్రైవర్ క్లీనర్ లేకుండా పనిచేస్తే 350 రూపాయలు ఎక్స్ట్రా పేమెంట్ కట్టిస్తున్నట్టు అలాగే సంవత్సరానికి ఒకసారి బోనస్ చెల్లిస్తున్నట్టుగా ఈ చర్చల్లో పాల్గొని చర్చించారు దీనికి ఒప్పుకున్న డ్రైవర్ల సంఘం అసోసియేషన్ నాయకుడు కౌశిక హరి ఒప్పంద పత్రంపై వారితో అగ్రిమెంట్ కుదిరించుకున్నారు ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ సురేష్ గౌడ్ శ్రీనివాస్ రెడ్డి లక్ష్మణ్ వెంకటేష్ సాగర్ తో పాటు లారీ డ్రైవర్లు సురేందర్ రవి సాగర్ తదితరులు ఉన్నారు..

Post A Comment: