February 2026
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం పట్టణంలోని ఓ ప్రభుత్వ హైస్కూల్లో బుధవారం ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాల ప్రాముఖ్యతను వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని చెప్పారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు. అదేవిధంగా సైబర్ మోసాల నుంచి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించారు. అనుమానాస్పద లింకులు, కాల్స్‌కు స్పందించకూడదని, వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదని హెచ్చరించారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యతను వివరిస్తూ, నేరాల నియంత్రణలో వాటి పాత్ర కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులు బాధ్యతాయుత పౌరులుగా మారి రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని ఎస్ఐ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం పరిధిలోని బయ్యారం గ్రామపంచాయతీ ప్రాంతంలో ప్రతిపాదిత చిన్న కాళేశ్వరం కాలువ నిర్మాణానికి సంబంధించి అధికారులు చేపట్టిన సర్వే కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. సర్వే నిర్వహించేందుకు గ్రామానికి వచ్చిన అధికారులను స్థానిక రైతులు, గ్రామస్తులు అడ్డుకుని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమకు ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూములే కుటుంబాల జీవనాధారమని పేర్కొన్నారు. ఆ భూముల మీదుగా కాలువ నిర్మాణం చేపడితే సాగు పూర్తిగా దెబ్బతింటుందని, తమ జీవనోపాధి సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా సాగు చేస్తున్న సారవంతమైన భూములను కోల్పోతే తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుందని తెలిపారు. కాలువ నిర్మాణానికి ముందు రైతుల అభిప్రాయాలు తెలుసుకోకుండా సర్వేలు నిర్వహించడం సరికాదని గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. భూముల స్వాధీనం, పరిహారం చెల్లింపు, ప్రత్యామ్నాయ భూముల కేటాయింపుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలకు తగిన పరిష్కారం చూపే వరకు సర్వే పనులు కొనసాగించనివ్వమని హెచ్చరించారు. రైతుల నిరసనతో సర్వే పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అనంతరం అధికారులు గ్రామస్తులతో చర్చలు జరిపి విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. సమస్యపై ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం మండల కేంద్రంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 53 కిలోల భారీ కేక్‌ను కట్ చేసి టపాసులు పేల్చి సంబరాలు జరిపారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, యువజన నాయకులు, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. దివంగత నేత, మాజీ స్పీకర్ శ్రీపాద రావు స్ఫూర్తిని కొనసాగిస్తూ, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు అండగా నిలుస్తూ ప్రజాసేవలో నిరంతరం కృషి చేస్తున్న శ్రీను బాబు సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని తెలిపారు. యువతకు మార్గదర్శిగా నిలుస్తూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తున్న శ్రీను బాబు ఆయురారోగ్యాలతో మరిన్ని ఉన్నత స్థానాలు అలంకరించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం: కాటారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వార్డు సభ్యులకు తొలి విడత శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఎంపీడీవో అడ్డూరి బాబు ముఖ్య అతిథిగా హాజరై శిక్షణా తరగతులను ప్రారంభించారు. గ్రామపంచాయతీ వ్యవస్థలో వార్డు సభ్యుల పాత్ర, బాధ్యతలు, గ్రామాభివృద్ధి పనుల అమలు, ప్రజా సమస్యల పరిష్కార విధానాలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామాల్లో పారదర్శక పాలనకు, అభివృద్ధి కార్యక్రమాల సమర్థ నిర్వహణకు వార్డు సభ్యులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా కృషి చేయాలని, ప్రజలతో సమన్వయం పెంచుకొని సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా పనిచేయాలని అన్నారు. శిక్షణలో శ్రీనివాస్, డి.రాజశేఖర్, బి.దేవేందర్ రెడ్డి, కె.మహేష్ శిక్షకులుగా పాల్గొని వివిధ అంశాలపై మార్గదర్శనం చేశారు. గుండ్రాత్లి, దామరకుంట, ఎలసాగర్, రంగారం, రేగులగూడెం, శంకరంపల్లి గ్రామాల వార్డు సభ్యులు హాజరయ్యారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం: గ్రామంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్రాజెక్టుపై టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, ఐఏఎస్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రాజెక్టు ప్రాంగణాన్ని సందర్శించిన ఆయన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, సోలార్ ప్యానెల్స్ అమరిక విధానం, నిర్వహణ పనితీరును సమగ్రంగా పరిశీలించారు. పనులు నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంపొందించడం ద్వారా విద్యుత్ సమస్యలను తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందుతుందని తెలిపారు. సోలార్ ప్రాజెక్టులు సమర్థవంతంగా పనిచేసేలా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. తనిఖీ సమయంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రాజెక్టు పురోగతిపై వివరాలు వెల్లడించారు. గ్రామ ప్రజలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సేవలు అందించేందుకు శాఖ కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం మండలం కొత్తపల్లి సుందరాజ్‌పేట్ గ్రామంలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కాలువల నిర్మాణంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ గ్రామ పరిధిలో కాలువలు నిర్మించవద్దని కోరుతూ ఇరిగేషన్ డీఈకు వినతిపత్రం సమర్పించారు. కాలువల నిర్మాణం వల్ల సాగుభూములు నష్టపోయే ప్రమాదం ఉందని, పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు తెలిపారు. భూములు కోల్పోతే జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ భూములను రక్షిస్తూ కాలువ మార్గాన్ని మార్చాలని అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. సమస్యను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు సమాచారం.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం మండలం చిదినేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో వేసవికాలంలో తలెత్తే నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని సమ్మర్ వాటర్ యాక్షన్ ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. గ్రామ పరిధిలోని దంతాలపల్లి, శ్రీనివాస కాలనీ, బొప్పారం ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిని అధికారులు పరిశీలించారు. మిషన్ భగీరథ ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈతో కలిసి గ్రామంలోని వాటర్ ట్యాంకులను తనిఖీ చేసి, ఎక్కడైనా లోపాలు ఉన్నాయా అని పరిశీలించారు. వేసవిలో నీటి సరఫరాలో అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. దంతాలపల్లి, బొప్పారం ప్రాంతాల్లో కొత్త బోర్లు మంజూరు చేయాలని గ్రామ ప్రతినిధులు కోరగా, సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి, ఉప సర్పంచ్ కొర్రల్ల రాజయ్య, అసిస్టెంట్ సంపత్, లైన్మెన్ వెంకటేశ్వర్లు, బాల్నే ప్రవీణ్, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వేసవికాలంలో నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

భూపాలపల్లి, ఫిబ్రవరి 23: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో బీసీ రజక కుటుంబంపై జరిగిన దాడిలో రెండు నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడం పట్ల తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను నిరసిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో కోవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా బాధిత కుటుంబానికి సంఘీభావంగా నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు పార్టీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మాట్లాడుతూ, బీసీలపై వరుసగా జరుగుతున్న దాడులను ప్రభుత్వం ఎందుకు అరికట్టలేకపోతోందని ప్రశ్నించారు. బలహీన వర్గాల ప్రాణాలకు భద్రత లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. రెండు నెలల శిశువు మృతి దారుణమని, నిందితులు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతుండటం చట్టవ్యవస్థ వైఫల్యమని విమర్శించారు. కుల అహంకారంతో జరిగే హత్యలు ఆగకపోతే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బీసీలకు ఎస్సీ, ఎస్టీలకు ఉన్నట్టే ప్రత్యేక రక్షణ చట్టం అవసరమని, వెంటనే “బీసీ అట్రాసిటీ చట్టం” తీసుకురావాలని డిమాండ్ చేశారు. బీసీలపై దాడిని సమాజంపై దాడిగా పరిగణించి కఠిన శిక్షలు విధించేలా చట్టం చేయాలని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించి, కుటుంబ సభ్యుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపడతామని రవి పటేల్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఇనుగాల ప్రణయ్ రాజ్, జిలకర శ్రీను, మామిడి శ్రీకాంత్, కౌటం సురేందర్, మోటపోతుల సమ్మయ్య, గంధం సిద్దు, దుస్స శ్రీకాంత్, ప్రభాత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కుమ్మేర మల్లన్న స్వామి జాతర సందర్భంగా రజక సోదరులపై జరిగిన దాడి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో రెండు నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పేర్కొన్నారు. దేవుడి దర్శనానికి వెళ్లిన వారిపై కులం పేరుతో దాడి చేయడం అమానుషమని, ఈ ఘటన తెలంగాణ సమాజాన్ని కలిచివేసిందన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు, పూర్తి రక్షణ కల్పించే వరకు పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ ఘటనపై బాధ్యులైన అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భూపాలపల్లి జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సమాజంలో ఎవరికైనా కులం పేరుతో అన్యాయం జరిగితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్నికల ప్రణయ్ రాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కౌటం సురేందర్, జిల్లా కార్యదర్శి మోటాపోతుల సమ్మయ్య, జిల్లా నాయకులు ఏదునూరి స్వామి రజక తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా : భూపాలపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్న 2026 సాధారణ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రవి పటేల్ మరియు వారి సతీమణి ఈరోజు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ, టీఆర్పీ తరఫున పోటీలో నిలిచిన ఐదుగురు అభ్యర్థులకు అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలిపారు. డబ్బు, మద్యం ప్రభావం విస్తరిస్తున్న ఎన్నికల వాతావరణంలోనూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు ప్రజల మన్ననలు పొందారని పేర్కొన్నారు .భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రజలు స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యబద్ధంగా వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటిస్తూ చివరి నిమిషం వరకు పోరాటం చేసిన అభ్యర్థులు పార్టీకి గర్వకారణమని అన్నారు. రాష్ట్ర, జిల్లా కమిటీల ఆదేశాల మేరకు, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఆశీస్సులతో భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా ప్రత్యర్థులతో పోటీపడి ప్రచారం కొనసాగించిన అభ్యర్థులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల ద్వారా జరుగుతున్న డబ్బు, మద్యం పంపిణీ మరియు అధికార దుర్వినియోగాన్ని ప్రజలు గమనించాలని కోరారు. భవిష్యత్ రాజకీయాలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీనే సరైన ప్రత్యామ్నాయమని రవి పటేల్ స్పష్టం చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి,గోదావరిఖని,ఫిబ్రవరి,5(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్ బ్యూరోఆఫ్ తెలంగాణ)బోరు మారింది...దాహం తీరింది..ముస్త్యాల గ్రామం మురిసింది..ప్రజాప్రతినిధుల చొరవపై ప్రశంసల వెల్లువ..ఆ ఊళ్లో బోరు చెడిపోయి...తాగునీటి కోసం గోస పడుతున్న జనం బాధ తీరింది.బాధ్యత గల ప్రజాప్రతినిధుల ప్రత్యేక చొరవతో గ్రామం మురిసింది. బోరు పని చేయడంతో ఇండ్లలో వాడకం నీటి సమస్య.దాహం తీరింది.పెద్దపల్లి జిల్లా,రామగిరి మండలం ముస్త్యాల గ్రామ సర్పంచి సుంకరి మహేశ్,ఉపసర్పంచి బాసినేని వినోద-సత్యనారాయణరావుల పనితీరుపై ప్రశంసల జల్లు కురిసింది.వివరాలు ఈ విధంగాఉన్నాయి...ముస్త్యాల గ్రామ పంచాయతీలోని రెండవ వార్డులో బెల్లంకొండ వారి ఇంటి ముందు ఉన్న నీటి బోరు మోటార్ స్టార్టర్ కాలిపోయి ఆ వార్డు ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడాల్సి వస్తోంది.ఇటీవల గ్రామస్థుల సహకారంతో మెజారిటీ విజయం సాధించిన సర్పంచ్,ఉపసర్పంచ్ ల దృష్టికి ఈ సమస్య వెళ్లింది.రెండవ వార్డులో ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారని తెలుసుకున్న ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించారు.ఆగమేఘాల మీద బుధవారం పాత మోటార్ ను తొలగించి అదే రోజు రాత్రి మోటార్ స్టార్టర్ తీసుకవచ్చి బిగించి పునరుద్ధరించారు.దీనితో బోరు పనిచేయడం ప్రారంభమైంది.తాగునీటి సమస్యను పరిష్కరించి గ్రామస్థుల దాహం తీర్చిన సర్పంచ్,ఉపసర్పంచ్ ల పనితీరు పట్ల సర్వత్రా హర్షంవ్యక్తమైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడరు.తమను నమ్ముకొని ఓటు వేసిన ప్రజలకు వెన్నంటి ఉంటామనీ,గ్రామంలో ఎప్పుడు ఏ కష్టం వచ్చినా తాము ముందు నిలబడుతామనీ,ఏలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు.ఇది తమ కర్తవ్యమనీ,గ్రామస్థుల సహకారం ఎల్లవేళలా ఉండాలని కోరారు.కార్యక్రమంలో వార్డు సభ్యులు,ప్రజలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


జయశంకర్ భూపాలపల్లి, : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఐదు వార్డులకు సంబంధించి తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారి ఆదేశాలు, రాష్ట్ర కమిటీ మార్గదర్శకాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. టీఆర్పీ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఐదుగురు అభ్యర్థులకు అధికారికంగా బీ-ఫారాలు అందజేసి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

బీ-ఫారాలు అందుకున్న అభ్యర్థులు వివరాలు ఇలా ఉన్నాయి.

భూపాలపల్లి మున్సిపాలిటీ 10వ వార్డు నుంచి అవధూత కవిత,

18వ వార్డు నుంచి గాజ వేణుగోపాల్,

22వ వార్డు నుంచి కౌటం సౌమ్య,

28వ వార్డు నుంచి ఇనుగాల ప్రణయ్ రాజ్,

29వ వార్డు నుంచి మామిడి శ్రీకాంత్ అభ్యర్థులుగా బరిలో నిలవనున్నారు.


ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మాట్లాడుతూ, తెలంగాణలో బహుజనుల ఆశలు, ఆకాంక్షలకు ప్రతినిధిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిలబడుతోందని తెలిపారు. గతంలో ఎన్నికల సమయంలో ఇతర పార్టీల కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదని, నేడు మన బహుజన అభ్యర్థులకు మన పార్టీ నుంచే బీ-ఫారాలు అందజేయడం గర్వకారణమని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన టీఆర్పీ అభ్యర్థులను ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. భూపాలపల్లి మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కోసం టీఆర్పీ పార్టీ అభ్యర్థులు ప్రజల పక్షాన నిలబడి నిజాయితీగా పనిచేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఎస్.పి.కే సాగర్, జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, జిల్లా నాయకులు సంతోష్, శ్రీకాంత్, సిద్ధు, జస్వంత్, కోటేష్, ఇతర నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ప్రపంచ ప్రఖ్యాత సమ్మక్క–సారలమ్మ మేడారం జాతర సందర్భంగా ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో ఇటీవల ఓ వార్త వేగంగా వైరల్ అయింది. ఈ వార్త కారణంగా భక్తులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే, ఈ ప్రచారం పూర్తిగా అసత్యమని పోలీసులు స్పష్టంచేశారు. వైరల్ అవుతున్న కథనాల ప్రకారం, మామిడితోట ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐదుగురు యువకులు వాష్‌రూమ్‌కు వెళ్లిన బాలికపై అత్యాచారం చేశారని, అనంతరం జంపన్నవాగు సమీపంలో ఓ షాపులో దాక్కున్న వారిని పోలీసులు పట్టుకున్నారంటూ పేర్కొన్నారు. ఈ విషయంపై పోలీసులు విచారణ జరిపిన అనంతరం, అలాంటి సంఘటన ఏదీ జరగలేదని తేల్చారు. ఈ ఘటనకు సంబంధించిన ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని కూడా అధికారులు తెలిపారు. ఈ అంశంపై స్పందించిన ములుగు జిల్లా పోలీసు అధికారులు, మేడారం జాతర ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉన్నాయని వివరించారు. జాతర ప్రాంగణం అంతటా భారీగా పోలీస్ బలగాలు, మహిళా పోలీసులు, ప్రత్యేక నిఘా బృందాలు విధులు నిర్వహిస్తున్నాయని చెప్పారు. జాతర జరుగుతున్న కాలంలో ప్రతి ఘటనను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. పోలీసుల ప్రకారం, సోషల్ మీడియాలో నిర్ధారణ లేకుండా ప్రచారం అవుతున్న వార్తలు ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించడమే కాకుండా, శాంతిభద్రతలకు కూడా ముప్పుగా మారుతాయి. అందుకే, ఎవరైనా ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తే, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మేడారం జాతరకు లక్షలాది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో, ప్రజలు పుకార్లను నమ్మకుండా అధికారిక వర్గాల ద్వారా వచ్చే సమాచారం మాత్రమే విశ్వసించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఏదైనా అనుమానాస్పద సమాచారం కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. జాతర శాంతియుతంగా, సురక్షితంగా కొనసాగేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.