పెద్దపల్లి,గోదావరిఖని,ఏప్రిల్,29(మేడిగడ్డ టీవీ న్యూస్ ఛానల్ బ్యూరో ఆఫ్ తెలంగాణ)ఆత్మబంధువు హెల్పింగ్ ఫౌండేషన్ అధ్యక్షుడు,జనసేన నాయకులు సుద్దాల అనురాజ్ ను శ్రీ సీతారామ సేవాసమితి వారు ఘనంగా సన్మానించారు.శ్రీ సీతారామ సేవాసమితి రెండవ వార్షికోత్సవ వేడుకలను సోమవారం బసంత్ నగర్ బుగ్గరామ స్వామి ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు,అందులో భాగంగా సుద్దాల అనురాజ్ సేవలను గుర్తించి,గోలివాడ చంద్రకళ సేవాసమితి సభ్యులు,సుద్దాల అనురాజును సత్కరించారు,ఈ సందర్భంగా వారు మాట్లాడరు,సీతారామ సేవాసమితి వారు చేసిన సత్కారానికి కృతజ్ఞతలు తెలిపారు,ఆదరించి సేవ చేసే తత్వము కలిగి ఉండాలని పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ మద్దెల దినేష్,సీతారామ సేవాసమితి గోలివాడ చంద్రకళ,మడిపల్లి మల్లేష్,వాసు,చంద్రమౌళి,తిరుపతి తదితరులు పాల్గొన్నారు...
ఏబీఎస్ఏఫ్ కెయూ ఇంచార్జ్ మచ్చ పవన్ కళ్యాణ్...
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 6న నిర్వహించే డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాలని అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ ఏ బీ ఎస్ ఏఫ్ కాకతీయ యూనివర్సిటీ ఇంచార్జ్ మచ్చ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కెయూ వీసీ తాటికొండ రమేష్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వేసవిలో ఎండ తివ్రత ఎక్కవగా ఉన్నందున విద్యార్థులకు డిగ్రీ పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు ఎండాకాలంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తే వడ దెబ్బకు గురికావడం జరుగుతుందనీ దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈనెల 6నుండి నిర్వహించే డిగ్రీ పరీక్షలు వాయిదా వేయకపోతే విద్యార్థులతో కలిసి వీసీ ఛాంబర్ ముట్టడిస్తాం అని ఏ బీ ఎస్ ఏఫ్ నాయకులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏబీఎస్ఏఫ్ నాయకులు దార సురేష్ నవీన్ సాయి నరేందర్ తదితరులు పాల్గొన్నారు....
మహాముత్తారం మండలం కనుకునూరు, రెడ్డిపల్లి గ్రామాల్లో ఎక్సైజ్ పోలీసులు గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ దాడులు చేపట్టారు. 2,400 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి 25 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వేసవి కాలం దృష్ట్యా తాగునీటి సరఫరా లో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతి కుమారి ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో తాగునీరు, ధాన్యం కొనుగోళ్లు, పాఠశాలల్లో మరమ్మతులు, వేసవి కాలం దృష్ట్యా వడగాలుల నుండి రక్షణ చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షించారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అడిషనల్ కలెక్టర్లు రాధిక గుప్తా, వెంకట్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ ప్రతి ఇంటికి తాగునీరు అందేవిధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. తాగునీటి సరఫరాలో ఏ సమస్య తలెత్తినా వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి పైపులైన్లు లీకేజీలు ఉన్నట్లయితే మరమ్మతులు చేపట్టాలన్నారు. వేసవి ముగిసే నాటికి కూడా ఎక్కడ కూడ తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.
అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని సిఎస్ శాంతి కుమారి అన్నారు. ధాన్యం కొనుగోలులో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. గన్నీ సంచులను ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉండేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా సిఎంఆర్ లక్ష్యాలు పూర్తి చేసేవిధంగా కృషి చేయాలన్నారు.
అమ్మ ఆదర్శ పాఠశాలల ఆధ్వర్యంలో పాఠశాలల్లో వెంటనే చేపట్టే మరమ్మతు పనులను గుర్తించి పనులను తక్షణమే ప్రారంభించాలన్నారు. పాఠశాలల్లో చేపట్టే పనులు నాణ్యంగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
వేసవి దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్ల ను అందుబాటులో ఉంచాలని అన్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మన ఊరి మనబడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పలు పాఠశాలల్లో చేపట్టిన పనులు ఏ ఏ దశలకు చేరుకున్నాయి, వాటికి సంబంధించిన బిల్లుల చెల్లింపు, ఇంకా చేపట్టాల్సిన చర్యల గురించి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సిఎస్ దృష్టికి తీసుకెళ్లారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలల వివరాలను తీసుకోవాలని, మన ఊరు మనబడి కార్యక్రమంలో ఏవైనా అసంపూర్తి పనులు మిగిలి ఉంటే పూర్తి చేయాలని పేర్కొన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో డిఆర్డిఓ నాగ పద్మజ, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వసంతలక్ష్మి, జిల్లా మేనేజర్ మహేందర్, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, సిపిఓ సత్యనారాయణరెడ్డి, మిషన్ భగీరథ ఈఈ రామాంజనేయులు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కాజీపేట డిప్యూటీ కమిషనర్ రవీందర్, , జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు, జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ అబ్దుల్ హై, డిసివో నాగేశ్వర్ రావు, మెప్మా పీడీ భద్రు నాయక్, జీడబ్ల్యూఎంసి ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, ఈఈ రాజయ్య, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, ఆర్ అండ్ బి డీఈ గౌస్ , కుడా, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఓటరు చైతన్యంపై ఈనెల 16వ తేదీన నిర్వహించే 5కె రన్ ను విద్యార్థులు,యువత, అధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో 5కె రన్ కు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అడిషనల్ కలెక్టర్లు రాధిక గుప్తా, వెంకట్ రెడ్డి, జిల్లా యువజన, క్రీడల అధికారి అశోక్ కుమార్, ఇతర అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తప్పకుండా ఓటు కలిగిన ప్రతి ఓటరూ ఓటు వేసేవిధంగా చైతన్యం తీసుకువచ్చేందుకే 5కె రన్ ను 16వ తేదీన ఉదయం 6 గంటలకు హనుమకొండ జెఎన్ స్టేడియం నుండి హనుమకొండ జిల్లా కలెక్టరేట్ వరకూ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
హనుమకొండ, వరంగల్ జిల్లాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 5కె రన్ ను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జిల్లాలో మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై విస్తృత ప్రచారం చేయాలని, అదే సమ యంలో సమాంతరంగా మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టు దిట్టమైన చర్యలు చేపట్టాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మాదక ద్రవ్యాల వల్ల జరిగే నష్టాల గురించి తెలియజేసే గోడ పత్రికను పోలిసు అధికారులతో కలిసి ఎస్పి అవిష్కరించారు. ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణకు పోలిసుశాఖ పటిష్ఠ చర్యలు చేపడుతుందని అన్నారు. మాదక ద్రవ్యాల రవాణా, సాగు, వినియోగం నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. నేటి యువత భావిభారత పౌరులని, వీరిలో కొంతమంది డ్రగ్స్‌కు ఆకర్షితులైతే దేశ భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. దీనిని గుర్తించి డ్రగ్స్‌వల్ల కలిగే విపరీత పరిణామాలపై అవగాహన పెంచుకొని దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్‌తో పాటు, గంజాయి, మాదక ద్రవ్యాలు, సిగరెట్ మొదలగు చెడు అలవాట్లకు సైతం దూరంగా ఉండాలన్నారు. చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుందని, ఆలోచనా విధానం, ఆలోచనా శక్తి నశిస్తాయన్నారు. భావితరాలు మాదకద్రవ్యాలపై ఆకర్షితులు కాకుండా వారికి సమాజంలో మంచి, చెడు తెలియజేయాలని ఎస్పి గారు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించాలని, జిల్లాలోకి మాదక ద్రవ్యాలు, గంజాయి రవాణా కాకుండా చెక్‌పోస్టుల వద్ద పకడ్బందీ నిఘా ఏర్పాటు చేయాలన్నారు. మాదక ద్రవ్యాల వాడకం వల్ల వచ్చే నష్టాలను వివరించాలని పోలిసు అధికారులను ఎస్పి ఆదేశించారు. భవిష్యత్తులో అతిపెద్ద సవాలుగా మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలు ఉంటాయని, వీటిని నియంత్రించేందుకు ప్రజలు సహకారం అందించాలని ఎస్పి కిరణ్ ఖరే పేర్కొన్నారు. నేటి యువతపై తల్లిదండ్రులు నిరంతర పర్యవేక్షణ ఉంచాలని, తప్పుడు దారులలో వెళ్లకుండా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం డిఎస్పి జి. రామ్మోహన్ రెడ్డి, డి. సి. ఆర్. బి ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఎస్బి ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్, టాస్క్ ఫోర్స్/ సీసీఎస్ ఇన్స్పెక్టర్ రవీందర్, జిల్లా పరిధిలోనిఎస్సైలు పాల్గొన్నారు.
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ములుగు జిల్లా కర్రిగుట్టలు, ఛత్తీస్గఢ్లోని కాంకేర్ పరిధిలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనాస్థలంలో 3 తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. 4 రోజుల క్రితం బీజాపూర్లో జరిగిన ఎన్ కౌంటర్లో 13 మంది మావోయిస్టులు మరణించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతిని హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో శుక్రవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా జ్యోతిని వెలిగించిన అనంతరం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు రాధిక గుప్తా, వెంకట్ రెడ్డి , ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, డిఆర్ఓ వై. వి. గణేష్,సోషల్ వెల్ఫేర్ డిడి నిర్మల, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
నయీంనగర్ పెద్ద మోరీని కూల్చే ముహూర్తం తేదీ 05-04-2024 నాడు అధికారులు కూల్చివేసేందుకు ఏర్పాట్లు చేశారు మరియు దీని స్థానంలో రూ.8.5 కోట్లతో కొత్త బ్రిడ్జి నిర్మాణం చేయనున్నారు ఇందులో భాగంగానే (03) నెలలపాటు నయీం నగర్ రోడ్డు పై రాకపోకలు బంద్ కానున్నాయి. రోడ్డు ప్రయాణికులకు మరియు వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలుగ కుండా తేదీ 05-04-2024 నుండి (03) నెలల పాటు రాకపోకలు బంద్ కానున్నా నేపద్యంలో ఈ క్రింద తెలుపబడిన ట్రాఫిక్ నిబంధనలు తీసుకోనైనది .
1. కరీంనగర్ నుండి ఖమ్మం, నర్సంపేట, వరంగల్ వైపుకు వెళ్లవలసిన భారీ వాహనాలు కేయుసి జంక్షన్ నుండి పెగడపల్లిడబ్బాల, పెద్దమ్మ గడ్డ, ఆటోనగర్, మీదుగా వెళ్ళవలెను.
2. కరీంనగర్ నుండి వచ్చేటువంటి RTC బస్సులు కేయుసి జంక్షన్ నుండి పెగడపల్లిడబ్బాల, పెద్దమ్మ గడ్డ, ములుగు రోడ్డు జంక్షన్, అమృత జంక్షన్, హన్మకొండ చౌరస్తా మీదుగా బస్సాండ్ చేరుకోవలెను.
3. ఖమ్మం నుండి కరీంనగర్ వైపు వెళ్లవలసిన భారీ వాహనాలు ఉరుసుగుట్ట, కడిపికొండ, మడికొండ, ORR మీదిగా వెళ్ళవలెను.
4. వరంగల్, నర్సంపేట, వైపు నుండి కరీంనగర్ వైపుకు వెళ్లవలసిన భారీ వాహనాలు MGM ములుగు రోడ్డు జంక్షన్,పెద్దమ్మ గడ్డ, పెగడపల్లిడబ్బాల, కేయుసి జంక్షన్ మీదుగా వెళ్ళవలెను.
5. హన్మకొండ నుండి కరీంనగర్ వైపు వెళ్ళు RTC బస్సులు హన్మకొండ చౌరస్తా, అమృత జంక్షన్, ములుగు రోడ్డు జంక్షన్, పెద్దమ్మ గడ్డ, పెగడపల్లిడబ్బాల, కేయుసి జంక్షన్ మీదిగా వెళ్ళవలెను.
ఇందుమూలంగా సమస్త ప్రయాణికులకు తెలియ జేయునది ఏమనగా ఇట్టిది ప్రజల సేవార్ధమై ఇచ్చినదిగా భావించి ప్రయాణికులకు అందరు ట్రాఫిక్ పోలీస్ సూచనలు పాటించి పైన తెలిపిన సరియగు ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రాయానించి పోలీసులకు సహకరించ గలరని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా నగర ప్రజలకు మనవి చేసారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించి ఈ నియోజకవర్గంలోని హనుమకొండ జిల్లా పట్టభద్రుల తుది ఓటర్ల జాబితాను హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎ.వెంకట్ రెడ్డి అందజేశారు.
హనుమకొండ జిల్లాకు సంబంధించి 43483 మంది పట్టభద్రులైన ఓటర్లు ఉన్నారని అడిషనల్ కలెక్టర్ వెల్లడించారు.
ఈ సమావేశంలో హనుమకొండ, పరకాల ఆర్డీవోలు వెంకటేష్, డాక్టర్ కె. నారాయణ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇ.వి శ్రీనివాసరావు, ఎ. విద్యాసాగర్, రావు అమరేందర్ రెడ్డి, ఎం. మణి, బీ. ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
నిర్దేశించిన గడువు వరకు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) లక్ష్యాలను సంబంధిత రైస్ మిల్లర్లు పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎ. వెంకట్ రెడ్డి అన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో సీఎంఆర్ లక్ష్యాలను పూర్తి చేయడంపై జిల్లాలోని రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలోని రైస్ మిల్లుల యజమానులతో నిర్దేశిత సీఎంఆర్ లక్ష్యం ఎంతవరకు పూర్తి చేశారు, మిగతా లక్ష్యాన్ని ఎప్పటి వరకు పూర్తి చేస్తారనే వివరాలను ఆయా రైస్ మిల్లుల యజమానులను జిల్లా అడిషనల్ కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ సిఎంఆర్ లక్ష్యాలను పూర్తి చేయడంలో రైస్ మిల్లర్లు నిర్లక్ష్యం వహించొద్దన్నారు. ప్రతిరోజు లక్ష్యం దిశగా చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వసంతలక్ష్మి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ మహేందర్, సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దారులు కృష్ణ, రోజా రాణి, రమేష్, సత్యనారాయణ, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్ రావు, జగన్, రా రైస్, పారాబాయిల్డ్ రైస్ మిల్లర్స్ పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రతి మండలంలో పాఠశాలలను మోడల్ స్కూల్స్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు-ఆరోగ్య ఉప కేంద్రాలు, గ్రామాల్లో తాగునీటి సరఫరా కి సంబంధించిన యాక్షన్ ప్లాన్, ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన, పోలింగ్ కేంద్రాలలో కనీస సదుపాయాల కల్పనపై జిల్లాలోని మండలాల ప్రత్యేక అధికారులు, ఎంఈఓ లు, ఇంజనీరింగ్ అధికారులు, పలు మహిళా సమైక్య అధ్యక్షులతో సమీక్ష సమావేశం బుధవారం సాయంత్రం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ
పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పనకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రణాళికతో మౌలిక వసతుల సదుపాయాల ను కృషి చేయాలన్నారు. పాఠశాలల్లో ముందుగా మైనర్ రిపేర్లని పూర్తిచేయాలని పేర్కొన్నారు. పాఠశాలల్లో ఒక్కో పనిని పూర్తిచేస్తూ మే నెల నాటికి అన్ని పనులను పూర్తిచేయాలని సూచించారు. ప్రతి పాఠశాలను మోడల్ గా తీర్చిదిద్దాలన్నారు. పాఠశాలల్లో బాలికల కోసం టాయిలెట్ల నిర్మాణం, మరమ్మతు పనులను పూర్తి చేయాలన్నారు. మహిళా సమాఖ్య గ్రూప్ అధ్యక్షులు పాఠశాలలను పరిశీలించి వాటికి కావాల్సిన పనులను మొదలుపెట్టాలన్నారు. ఏ ఏ సమస్యలు ఉన్నాయో వాటిని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని మహిళా సమాఖ్య అధ్యక్షులకు తెలియజేశారు. అర్బన్ ప్రాంతంలో అధికారులు ప్రత్యేక దృష్టిని సారించాలన్నారు. గతంలో పలు పాఠశాలల్లో పనుల నిమిత్తం మన ఊరు మనబడి కార్యక్రమం కింద మంజూరు చేయడం జరిగిందని, పూర్తి అయిన పనులను వదిలిపెట్టి మిగతా పనులను పూర్తి చేయాలన్నారు. మంజూరైన నిధులతో తప్పనిసరిగా చేపట్టాల్సిన పనులను పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. పాఠశాలల్లో ఏయే పనులను పూర్తిచేయాలో ఇంజనీరింగ్, ఎంపీడీవో, ఎంఈఓ, ఇతర అధికారులు సమన్వయంతో పనులను పూర్తి చేయాలన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి...
జిల్లాలోని అన్ని మండలాల్లో మిగిలిన చోట్లా ధాన్యం కొనుగోలు కేంద్రాలను నాలుగో తేదీన తప్పకుండా ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
అదేవిధంగా పాఠశాలల్లో కేటాయించిన పోలింగ్ కేంద్రాలలో విద్యుత్తు, తాగునీరు, టాయిలెట్స్, ర్యాంపు, ఇతర కనీస సదుపాయాలు ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఏ పోలింగ్ కేంద్రంలోనూ సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.
వేసవికాలం దృష్ట్యా తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఏవైనా మరమ్మతు పనులు ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వేసవికాలం దృష్ట్యా ఈజీఎస్ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లతోపాటు అవసరమైన మందులు ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు రాధిక గుప్తా, వెంకట్ రెడ్డి, డిఈవో డాక్టర్ అబ్దుల్ హై, జడ్పీ సీఈవో విద్యాలత, డీఆర్డీవో నాగ పద్మజ, డిపిఓ లక్ష్మీ రమాకాంత్, మిషన్ భగీరథ ఈఈ మల్లేశం, మెప్మా పీడీ భద్రునాయక్, డిఎంహెచ్వో డాక్టర్ సాంబశివరావు, బీసీ వెల్ఫేర్ డిడి రామ్ రెడ్డి, డీఎస్ఓ వసంతలక్ష్మి, ఇతర అధికారులు, పలు మహిళా సమాఖ్య గ్రూప్ అధ్యక్షురాల్లు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తలెత్తే సమస్యలపై ఫిర్యాదుల కోసం ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ లోని టోల్ ఫ్రీ నెంబర్ 8143739243 ను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ బుధవారం ప్రారంభించారు. ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ కు సంబంధించిన వివరాలను పౌరసరఫరాల శాఖ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వసంత లక్ష్మి, పౌరసరఫరాల కార్పొరేషన్ మేనేజర్ మహేందర్, ఏఎస్ఓ నరసింహారావు, సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్లు కృష్ణ, రమేష్, సత్యనారాయణ, రోజా రాణి తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు, వివిప్యాట్ల మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మొదటి దశ ర్యాండమైజేషన్ ను బుధవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాండమైజేషన్ ప్రక్రియకు సంబంధించిన రికార్డులను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు.
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ర్యాండమైజేషన్లో భాగంగా జిల్లాలోని పరకాల నియోజకవర్గానికి సంబంధించి 239 పోలింగ్ కేంద్రాలకు గాను 298 బ్యాలెట్ యూనిట్లు, 298 కంట్రోల్ యూనిట్లు, 334 వివిప్యాట్లు, అదేవిధంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి 244 పోలింగ్ కేంద్రాలకుగాను 305 బ్యాలెట్ యూనిట్లు, 305 కంట్రోల్ యూనిట్లు, 341 వివిప్యాట్లను కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు.
సువిధ యాప్, పోస్టల్ బ్యాలెట్ , తదితర ఎన్నికలకు సంబంధించిన అంశాలను గురించి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు చర్చించారు.
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు రాధిక గుప్తా, వెంకట్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీఆర్వో వై. వి. గణేష్, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు వెంకటేష్, డాక్టర్ కె. నారాయణ, హనుమకొండ తహసిల్దార్ విజయ్ కుమార్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ప్రసాదరావు, కలెక్టరేట్ ఏవో సత్యనారాయణ, నాయబ్ తహసీల్దార్ జె. శ్యామ్ కుమార్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇ. వి. శ్రీనివాస్ రావు, రజినీకాంత్, మణి, శ్యామ్, నేహాల్, సయ్యద్ ఫైజుల్లా, జైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;పెరిగిపోతున్న సాంకేతికతకు తగ్గట్టుగానే, సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రతీ పోలీస్ స్టేషన్ లో ఒకరిని సైబర్ వారియర్ గా నియమించి వారికి మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు అందజేయడం జరిగిందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నూతనoగా సైబర్ క్రైమ్ డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన N.సుభాష్ బాబు, ఎస్పి ని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఎస్పి మాట్లాడుతూ సైబర్ నేరాలను నియంత్రించడం, ప్రజలు సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. అలాగే అన్ని స్థాయిల పోలీస్ అధికారులు సైతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సైబర్ క్రైమ్స్ పట్ల మరింత అవగాహన కలిగివుండాలని పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ లో సైబర్ సెక్యూరిటీ ప్రతినిధిని కేటాయించామని, సైబర్ నేరాల బారిన పడిన ప్రజలు వెంటనే 1930 కి కాల్ చేయడం గానీ, NCRP పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. బాధితులు ఫిర్యాదులను నమోదు చేసుకుంటేనే గుర్తించడం సులువవుతుందని ఈ సందర్భంగా ఎస్పి కిరణ్ ఖరే గారు తెలియజేశారు.