ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
నిర్దేశించిన గడువు వరకు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) లక్ష్యాలను సంబంధిత రైస్ మిల్లర్లు పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎ. వెంకట్ రెడ్డి అన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో సీఎంఆర్ లక్ష్యాలను పూర్తి చేయడంపై జిల్లాలోని రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలోని రైస్ మిల్లుల యజమానులతో నిర్దేశిత సీఎంఆర్ లక్ష్యం ఎంతవరకు పూర్తి చేశారు, మిగతా లక్ష్యాన్ని ఎప్పటి వరకు పూర్తి చేస్తారనే వివరాలను ఆయా రైస్ మిల్లుల యజమానులను జిల్లా అడిషనల్ కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ సిఎంఆర్ లక్ష్యాలను పూర్తి చేయడంలో రైస్ మిల్లర్లు నిర్లక్ష్యం వహించొద్దన్నారు. ప్రతిరోజు లక్ష్యం దిశగా చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వసంతలక్ష్మి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ మహేందర్, సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దారులు కృష్ణ, రోజా రాణి, రమేష్, సత్యనారాయణ, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్ రావు, జగన్, రా రైస్, పారాబాయిల్డ్ రైస్ మిల్లర్స్ పాల్గొన్నారు.
Post A Comment: