ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు, వివిప్యాట్ల మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మొదటి దశ ర్యాండమైజేషన్ ను బుధవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాండమైజేషన్ ప్రక్రియకు సంబంధించిన రికార్డులను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు.
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ర్యాండమైజేషన్లో భాగంగా జిల్లాలోని పరకాల నియోజకవర్గానికి సంబంధించి 239 పోలింగ్ కేంద్రాలకు గాను 298 బ్యాలెట్ యూనిట్లు, 298 కంట్రోల్ యూనిట్లు, 334 వివిప్యాట్లు, అదేవిధంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి 244 పోలింగ్ కేంద్రాలకుగాను 305 బ్యాలెట్ యూనిట్లు, 305 కంట్రోల్ యూనిట్లు, 341 వివిప్యాట్లను కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు.
సువిధ యాప్, పోస్టల్ బ్యాలెట్ , తదితర ఎన్నికలకు సంబంధించిన అంశాలను గురించి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు చర్చించారు.
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు రాధిక గుప్తా, వెంకట్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీఆర్వో వై. వి. గణేష్, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు వెంకటేష్, డాక్టర్ కె. నారాయణ, హనుమకొండ తహసిల్దార్ విజయ్ కుమార్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ప్రసాదరావు, కలెక్టరేట్ ఏవో సత్యనారాయణ, నాయబ్ తహసీల్దార్ జె. శ్యామ్ కుమార్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇ. వి. శ్రీనివాస్ రావు, రజినీకాంత్, మణి, శ్యామ్, నేహాల్, సయ్యద్ ఫైజుల్లా, జైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: