ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఓటరు చైతన్యంపై ఈనెల 16వ తేదీన నిర్వహించే 5కె రన్ ను విద్యార్థులు,యువత, అధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో 5కె రన్ కు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అడిషనల్ కలెక్టర్లు రాధిక గుప్తా, వెంకట్ రెడ్డి, జిల్లా యువజన, క్రీడల అధికారి అశోక్ కుమార్, ఇతర అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తప్పకుండా ఓటు కలిగిన ప్రతి ఓటరూ ఓటు వేసేవిధంగా చైతన్యం తీసుకువచ్చేందుకే 5కె రన్ ను 16వ తేదీన ఉదయం 6 గంటలకు హనుమకొండ జెఎన్ స్టేడియం నుండి హనుమకొండ జిల్లా కలెక్టరేట్ వరకూ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
హనుమకొండ, వరంగల్ జిల్లాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 5కె రన్ ను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: