మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెదోళ్లకు అభయహస్తంగా కొండంతా అండగా నిలుస్తున్నారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేదవారికి కష్టం ఉంటే నేనున్నానంటూ తమ అభయహస్తాన్ని అందిస్తు పేదవాళ్లకు ఆసరా నిలుస్తున్నారు. రామగుండం నియోజకవర్గం లో ఎవరికైనా కష్టం వచ్చిన ముందుండి వారికి సహాయసహకారాలు అందిస్తు ప్రజలందరి మన్ననలు పోందుతున్నారు. 13వ డివిజన్ పెద కుటుంబానికి చెందిన దొడ్ల వనిత-రవి ల కుమార్తే హాసిని వివాహం ఈ నెల 21వ తేదిన జరగనుండగా ఎమ్మెల్యే విజయమ్మ పౌండేషన్ ద్వారా వారికి పుస్తె మెట్టెల ను ఎమ్మెల్యే ఆదేశాల మేరకు13 వ డివిజన్ కార్పొరేటర్ రాకం లత-దామోదర్ స్వయంగా అమ్మాయి నివాసంలో అందించారు.
రామగుండం నియోజక వర్గంలోని పేద వారికి సహాయ సహకారాలు అందించేందుకు విజయమ్మ ఫౌండేషన్ ఏర్పాటు చేసి గత నాలుగు సంవత్సరాల కాలంగా ఎంతోమంది నిరుపేదలకు సహాయం అందిస్తున్నమని రామగుండం నియోజకవర్గంలోని ప్రజలకు ఏ కష్టం తాము ముందుండి వారిని కాపాడుకుంటామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. ఈ కార్యక్రమం లో 13 వ డివిజన్ కార్పొరేటర్ రాకం లత-దామోదర్, విజయమ్మ ఫౌండేషన్ కో ఆర్డినేటర్ ఎడెల్లి శ్యామ్,సిద్దు మరియు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: