మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
-"జులేఖాబి హెల్పింగ్ పీపుల్ ట్రస్ట్" ఆధ్వర్యంలో చిన్నారి 'రుమాన తబస్సుం ' పుట్టిన రోజు వేడుకలు ఆశ్రమంలో నిర్వహించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని విటల్ నగర్ ఏరియా అమ్మా పరివార్ ఆశ్రమంలో రామగుండం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, పబ్లిక్ టీవీ ఎండి, ట్రస్ట్ వ్యవస్థాపకులు షేక్ జమీల్ హుస్సేన్ కూతురు "రుమాన తబస్సుం" పుట్టినరోజు సందర్భంగా అమ్మ పరివార్ ఆశ్రమంలో చిన్నారులకు, వృద్ధులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జమీల్ హుస్సేన్ మాట్లాడుతూ దైవ కార్యంలో ఒకరికి సేవ చేయడం మానవతాన్ని పెంపొందించడమే అని అన్నారు. ప్రతి ఒక్కరు పేదలను ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. సేవ కోసం ఎంతో కొంత కృషి చేయాలనీ అన్నారు. ఇందులో భాగంగానే తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిన్నారి "రుమాన తబస్సుం" పుట్టినరోజు సందర్భంగా తబిత ఆశ్రమంలో పండ్ల పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రామగుండం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ వడ్డేపల్లి దినేష్, ఆశ్రమ సేవకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: