మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



జేవి చలపతిరావు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి పి ఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ

పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ పౌర హక్కుల సంఘం(సి ఎల్ సి) చతిస్గడ్ రాష్ట్రంలో ఆదివాసులపై మావోయిస్టుల ఏరివేత పేరుతో  కేంద్ర ప్రభుత్వం జరిపిన వైమానిక దాడులకు నిరసనగా ఆదివాసి ప్రజల పోరాటాలకు మద్దతుగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు నిరసనగా బహిరంగ సభకు పెద్దపెల్లి జిల్లా పోలీసులను అనుమతి నిరాకరించడాన్ని సిపిఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తోంది. 

ఈ మేరకు గోదావరిఖనిలో జరిగిన ఒక సమావేశంలో సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జేవి చలపతిరావు  మాట్లాడుతూ  తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక  చర్యలను ఖండించారు. 

బిజెపి ప్రభుత్వ అణిచివేత చర్యలను తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అమలు చేస్తున్నాడు దానికి అనేక ఉదాహరణలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రగతిశీల వ్యక్తులపై సంస్థలపై ప్రజల పక్షాన వినిపిస్తున్న గొంతులపై తీవ్ర నిర్బంధాన్ని అణిచివేతను ప్రయోగిస్తున్నారు.

ఆపరేషన్ సమాధానం పేరిట గ్రీన్ హంట్ పేరిట మావోయిస్టు ఏరివేత పేరుపై చతిస్గడ్ గిరిజన ఆదివాసి గ్రామాలపై  దేశ సరిహద్దులు కాపలా కాసే సైన్యం హెలికాప్టర్లు నేడు మనదేశంలో ఉండి  సమాజానికి దూరంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసులపై చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము తెలంగాణలో ఉన్న పౌర హక్కుల సంఘం తన వాక్ సభ స్వాతంత్ర్యంను ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్ట్ చర్యలను ఖండిస్తూ బహిరంగ సభకు అనుమతిని కోరితే  పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని మా పార్టీ సిపిఐ(ఎం ఎల్) న్యూడెమోక్రసీ వ్యతిరేకిస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరైనది కాదని అభిప్రాయపడుతుంది. ప్రజలు ప్రజాస్వామ్యవాదులు విప్లవ అభిమానులు విప్లవ ప్రజానీకం కేసీఆర్ ప్రభుత్వం బహిరంగ సభకు పర్మిషన్ ఇవ్వకపోవడాన్ని వ్యతిరేకించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము

ఈ సమావేశంలో సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి 

 కే రాజన్న, జిల్లా నాయకులు ఐ కృష్ణ, ఏ వెంకన్న ఈదునూరి నరేష్,  భూమేశ్వర్, చిలుక శంకర్,ఎ రాములు,బి అశోక్. పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: