మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం నియోజకవర్గం..
పాలకుర్తి మండలం కుక్కల గూడూరు గ్రామంలోని బండల వాగు ప్రాజెక్టుకు ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ప్రారంభించిన మన ఎమ్మెల్యే కోరకంటి.చందర్.
ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం.కేసీఆర్ రైతుల పక్షపాతి.
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి.చందర్ .
రాష్ట్ర రైతుల బాగు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, అమలు చేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి.చందర్ అన్నారు. పాలకుర్తి మండలం తక్కల్లపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే కు విన్నవించారు.
ప్రధానంగా వడ్ల తరలింపు సమస్యను ఎదుర్కొంటున్న నేపథ్యంలో సంబంధిత అధికారికి ఫోన్ చేసి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. వడ్ల కొనుగోలు సమయంలో రైస్ మిల్లర్లు ఎక్కువగా కటింగ్ పెడుతున్నారని రైతులు చెప్పడంతో.. అటువంటి తప్పిదాలు మరల జరగకుండా చూడాలని సంబంధిత మిల్లర్ ను హెచ్చరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంమంత్రి కేసీఆర్ నేతృత్వంలో.. రాష్ట్రంలో రైతుల కోసం అనేక అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలవుతున్నాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రం సస్య శ్యామలంగా రూపుదిద్దుకుందన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట వైస్ ఎంపిపి ఎర్రం స్వామి, బిఆర్ఎస్ నాయకులు పర్లపల్లి రవి, నారాయణదాసు మారుతీ, తోడేటి శంకర్ గౌడ్, దొమ్మేటి వాసు తదితరులున్నారు.
Post A Comment: