మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


తోటి జర్నలిస్టుకు సాయం అందజేసిన రామగుండం ప్రెస్ క్లబ్..  రామగుండం ప్రెస్ క్లబ్ ఒక జర్నలిస్టుల కుటుంబం  ప్రెస్ క్లబ్ అధ్యక్షులు షేక్ జమీల్ హుస్సేన్..  తెలంగాణా క్రాంతి ప్రతినిధి గోదావరిఖని మే 20:  రామగుండం ప్రెస్ క్లబ్ వివిధ  సేవా కార్యక్రమాలలోనే కాక తన జర్నలిస్ట్ కుటుంబంలో కలిగిన ఆపదలను కూడా ఐక్యంగా ఎదుర్కోగలరని మరోసారి రామగుండం ప్రెస్ క్లబ్ టీం నిరూపించుకున్నారు.  అడ్డగుంటపల్లిలో నివసిస్తున్న సీనియర్ జర్నలిస్ట్, రామగుండం ప్రెస్ క్లబ్ సభ్యులు గుండారపు శ్రీనివాస్ అలియాస్ వెన్నెల శీను కొంత కాలంగా నడవలేని స్థితిలో అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకొని రామగుండం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు కలిసి జర్నలిస్ట్ శీనుకు ఆర్దిక సహాయం అందించాలని ప్రెస్ క్లబ్ సభ్యులతో చర్చించగా అందరూ సానుకూలంగా వెంటనే స్పందించి సభ్యులంతా ఏకమై పోగు చేసిన 12 వేల రూపాయల నగదును శనివారం వారి కుటుంబ సభ్యుల సమక్షంలో అధ్యక్షులు షేక్ జమీల్ హుస్సేన్ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యుల చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు జమీల్ హుస్సేన్ మాట్లాడుతూ రామగుండం ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు,వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కొరకు ఏర్పడిందని జర్నలిస్టులందరూ ఒక కుటుంబంగా కలిసి మెలిసి ఐక్యంగా ఉంటూ జర్నలిస్టు వృత్తికి తగిన న్యాయం చేసే విధంగా, పరస్పర సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు నడవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పర్కాల లక్ష్మీనారాయణ గౌడ్, ఉపాధ్యక్షులు కోండ్ర అంజయ్య యాదవ్, కోశాధికారి కండే రవీందర్, కార్యనిర్వహణ కార్యదర్శి అనిల్ కుమార్, సలహాదారు బెందే నాగభూషణం, కార్యవర్గ సభ్యులు ఎన్ మహేష్, డి నగేష్, ఈ వివేక్, తెలంగాణ క్రాంతి పెద్దపల్లి స్టాపర్ జి.రమేష్ పటేల్ , కే జీవన్, దాసరి లక్ష్మణ్, జె రాజశేఖర్, పి నర్సింగరావు,క్లబ్ ఇంచార్జ్ సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: