మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం నియోజకవర్గం లో ఇటివల అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలను ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పరామర్శించారు. అంతర్గాం మండలం మద్దిరాల గ్రామానికి చెందిన దేశబత్తుల రాయాలింగు, ఇసంపేట గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ బరుపటి కిష్టయ్య, ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన లెగిసెట్టి లచ్చవ్వ, కొత్తపల్లి గ్రామానికి చెందిన అమ్ముల సదయ్య మృతి చెందగా మృతి ని భార్య కవితను పరమర్శించారు. 2 వేల రూపాయలు అర్దిక సహాయం అందించారు. మృతుల కుటుంబాలను ఓదార్చారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్న ఎల్లప్పుడు తన సహాయ సహకారాలు అందజేస్తానని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. అదేవిధంగా కుక్కల గూడూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తుంకూరి శంకర్ భార్య సునీత ఆరోగ్యానికి గురికాగా.. వైద్యానికి అవసరమైన సహాయాన్ని అందజేస్తానని అన్నారు. ఎమ్మెల్యే వెంట వైస్ ఎంపీపీ ఎర్రం స్వామి, జయ్యారం ఎంపిటిసి గంగాధర రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లం రాజయ్య, ఫ్యాక్స్ చైర్మన్ మామిడాల ప్రభాకర్, బి.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తిరుపతి నాయక్, సందేలా మల్లయ్య, రావుల పున్నం సాగర్, కొల్లూరి సతీష్, పర్లపల్లి రవి, నారాయణదాసు మారుతి, తోడేటి శంకర్ గౌడ్, దొమ్మటి వాసు తదితరులున్నారు.
Post A Comment: