మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు  రామగుండం ప్రాంతంలో పర్యటన కార్యక్రమాలు ఉన్నందున పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి ని మరియు ఇతర ప్రశ్నించే గొంతులను ముందస్తుగా అరెస్టు చేసి గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నిర్బందించడం దుర్మార్గపు చర్య.సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతంలో జరుగుతున్న అవినీతి , అక్రమాల గురించి, ఓపెన్ కాస్ట్ లో జరుగుతున్న అవినీతి, విద్వంసం,ముఖ్యంగా ఆర్ ఎఫ్ సి ఎల్ లో జరిగిన అవినీతి,ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయలు అధికార పార్టి నాయకులు వసూళ్ళు చేయడం,ఉద్యోగాలు రాక కార్మికులు చనిపోవడం గురుంచి పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో నిజనిర్ధారణ చేసి ఆ విషయాలను ప్రజల ముందు ఉంచినందుకే, భాదితుల పక్షాన నిలిచినందుకే ప్రభుత్వం కక్ష కట్టి ఈ రోజు మాధన కుమార స్వామినీ ముందస్తు అక్రమ అరెస్ట్ చేసిందని మేము భావిస్తున్నాము. 

ఈ అక్రమ  అరెస్టులను ప్రజాస్వామికవాదులు,ప్రతిపక్షపార్టీలు,హక్కులసంఘాలు,విద్యార్థి,కార్మిక సంఘాలు ముక్త కంఠంతో ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అక్రమంగా అరెస్ట్ చేసిన కాంగ్రెస్, సిపిఐ ఏఐఎస్ఎఫ్ సీపీఎం, హెచ్ఎంఎస్ సిపిఐ ఎంఎల్- ప్రజా పంథా, మల్లన్న టీమ్ నాయకులు, ఇతర ప్రజా సంఘాల నాయకులను భేషరతుగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన నాయకులు

1) గుమ్మడి కొమురయ్య

 జిల్లా కన్వీనర్

తెలంగాణ ప్రజా ఫ్రంట్

పెద్దపల్లి జిల్లా 

2) గాండ్ల మల్లేషం, జిల్లా కో కన్వీనర్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ పెద్దపల్లి జిల్లా కమిటి

3) బాలసాని రాజయ్య, విరసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా భాద్యులు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: