మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పేద ప్రజల హితం కోసం కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయడం సమిష్టి అభిమతం కావాలని మంత్రి కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుని ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల కనీస సౌకర్యాల కల్పనను పట్టించుకోని ప్రతిపక్ష నేతలను శంకరగిరి మాన్యాలు పట్టించాలని పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా రామగుండంలో నూతన పోలీస్ కమిషనరేట్ భవనం ప్రారంభం సహా రూ. 300 కోట్ల పైచిలుకు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.*రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో. జరిగిన బహిరంగసభలో విపక్షాలపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. 55 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేసింది శూన్యమని విమర్శించారు. ప్రజల బాధలు పట్టించుకోని నాయకులను నమ్మితే ప్రజలను నట్టేట ముంచడం ఖాయమన్నారు. పనిచేసే నిఖార్సయిన నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందిరపైనా ఉందని అందుకే రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ని కడుపులో పెట్టి కాపాడుకోవాలని రామగుండం ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌పై అవాక్కులు చవాక్కులు ప్రదర్శిస్తున్న నాయకులకు ప్రజలు ఓటు రూపంలో మద్దతు తెలిపి గట్టి బుద్ధిచెప్పాలని జనాన్ని కోరారు.దేశ సరిహద్దులో సైన్యం కాపాడితే అంతర్గత శాంతి భద్రతలను స్థానిక పోలీసులు కాపాడుతున్నారు. ఒకప్పుడు బెంగాల్ దేశానికి మార్గదర్శనం చేస్తుందనే నానుడి ఉండేది. ఇప్పుడు తెలంగాణ దేశానికి నిర్దేశనం చేస్తోంది. దేశంలో ఉత్తమ పోలీస్ అంటే దేశం మొత్తం తెలంగాణ వైపు చూసే పరిస్థితి నెలకొంది. ఆధునిక టెక్నాలజీను వినియోగిస్తున్న పోలీసులంటే తెలంగాణ పోలీసులే.. పోలీసింగ్ అంటే కేవలం అడుగడుగునా కార్లు కెమెరాలు మాత్రమే కాదు.. ఎఫిక్టివ్ పోలీసింగ్ ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం".- కేటీఆర్, ఐటీ శాఖ మంత్రి. 300 కోట్ల పైచిలుకు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పేద ప్రజల హితం కోసం కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయడం సమిష్టి అభిమతం కావాలని మంత్రి కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుని ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల కనీస సౌకర్యాల కల్పనను పట్టించుకోని ప్రతిపక్ష నేతలను శంకరగిరి మాన్యాలు పట్టించాలని పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా రామగుండంలో నూతన పోలీస్ కమిషనరేట్ భవనం ప్రారంభం సహా రూ. 300 కోట్ల పైచిలుకు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.*రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో. జరిగిన బహిరంగసభలో విపక్షాలపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. 55 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేసింది శూన్యమని విమర్శించారు. ప్రజల బాధలు పట్టించుకోని నాయకులను నమ్మితే ప్రజలను నట్టేట ముంచడం ఖాయమన్నారు. పనిచేసే నిఖార్సయిన నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందిరపైనా ఉందని అందుకే రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ని కడుపులో పెట్టి కాపాడుకోవాలని రామగుండం ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌పై అవాక్కులు చవాక్కులు ప్రదర్శిస్తున్న నాయకులకు ప్రజలు ఓటు రూపంలో మద్దతు తెలిపి గట్టి బుద్ధిచెప్పాలని జనాన్ని కోరారు.దేశ సరిహద్దులో సైన్యం కాపాడితే అంతర్గత శాంతి భద్రతలను స్థానిక పోలీసులు కాపాడుతున్నారు. ఒకప్పుడు బెంగాల్ దేశానికి మార్గదర్శనం చేస్తుందనే నానుడి ఉండేది. ఇప్పుడు తెలంగాణ దేశానికి నిర్దేశనం చేస్తోంది. దేశంలో ఉత్తమ పోలీస్ అంటే దేశం మొత్తం తెలంగాణ వైపు చూసే పరిస్థితి నెలకొంది. ఆధునిక టెక్నాలజీను వినియోగిస్తున్న పోలీసులంటే తెలంగాణ పోలీసులే.. పోలీసింగ్ అంటే కేవలం అడుగడుగునా కార్లు కెమెరాలు మాత్రమే కాదు.. ఎఫిక్టివ్ పోలీసింగ్ ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం".- కేటీఆర్, ఐటీ శాఖ మంత్రి.

Post A Comment: