మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

రామగుండం కార్పొరేషన్ పరిధి 43వ డివిజన్ విజయ్ నగర్ కు చెందిన అచ్చు పినికాసి శ్రీనివాస్ అనే పెయింటింగ్ కార్మికుడు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మంచానికి పరిమితమై ఇల్లు గడవడం కష్టంగా ఉందని  శ్రీనివాస్ కుటుంబ సభ్యులు సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా  చింతల భాస్కర్ రావు సహకారంతో అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్ కుటుంబానికి 25 కిలోల బియ్యం మరియు నిత్యవసర సరుకులను ఫౌండేషన్ సభ్యులు నిమ్మరాజుల రవి ద్వారా బాధిత కుటుంబానికి అందజేశారు బియ్యం అందజేసిన అనంతరం సేవా స్ఫూర్తి ఫౌండేషన్ ప్రతినిధి నిమ్మరాజుల రవి మాట్లాడుతూ శ్రీనివాస్ పెయింటింగ్ పని చేసుకుంటూ భార్య ఇద్దరు ఆడపిల్లలతో విజయ్ నగర్ లో నివాసం ఉంటున్నాడని గత కొద్దిరోజులుగా అనారోగ్యం కు గురై పనిచేయడానికి ఆరోగ్యం  సకరించక ఇంటికి పరిమితం కాగా తినడానికి కూడా కష్టంగా మారిందని శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తెలుపగానే వెంటనే స్పందించిన సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేషన్న ఆధ్వర్యంలో చింతల భాస్కర్ రావు సహకారంతో  నా ద్వారా బియ్యం మరియు నిత్యావసర సరుకులను పంపించడం జరిగిందని నిమ్మరాజుల రవి తెలిపారు అనారోగ్యంతో బాధపడుతూన్నా శ్రీనివాస్ కుటుంబాన్ని మరికొంతమంది దాతలు కూడా ముందుకు వచ్చి  ఆదుకోవాల్సిందిగా నిమ్మరాజుల రవి విజ్ఞప్తి చేశారు అడగగానే సహాయం అందించిన మడిపెల్లి మల్లేష్ కు మరియు నాతోటి ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరికీ మరియు ఈనాటి దాత చింతల భాస్కర్ రావు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని  నిమ్మరాజుల రవి తెలిపారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధి తల్వార్ సిద్దేశ్వర్ పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: