మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

ఎన్టిపిసి పీకే రామయ్య కాలనీ లోని ఇందిరమ్మ కాలనీలో నిరాశ్రయులైన నిరుపేదలు ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల్లో గత వారం రోజులుగా అక్కడ  టెంట్లు వేసుకొని ఉండగా, ఈరోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్  వారి పోరాటానికి మద్దతు తెలుపుతూ, అక్కడికి వెళ్లి  ప్రతి ఒక్క నిరాశ్రయుడితో మాట్లాడి, ఓదార్చుతూ అధైర్యపడవద్దని, మీరందరూ కూడా ఒక్కతాటి పైన ఉంటేనే మీ మీ డిమాండ్లు పరిష్కారం అవుతాయని అదేవిధంగా నా వంతుగా మీ ఈ సమస్యను  స్థానిక ఎమ్మార్వో  మరియు కలెక్టర్  దృష్టికి తీసుకువెళ్లి మీకు ఇండ్ల పట్టాలు ఇప్పించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇవ్వగా, గతంలో కాంగ్రెస్ పార్టీ హయంలోనే ఇండ్లు లేని ఎంతో మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించడంతో పాటు,

సింగరేణి స్థలాలల్లో నివసిస్తున్న కార్మికులకు పట్టాలిప్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అన్నారు...

ఈ సందర్భంగా అక్కడ వున్న నిరుపేద నిరాశ్రయులు మాట్లాడుతూ  పిలవకున్నా మా సమస్యలు తెలుసుకొని మా దగ్గరికి వచ్చి మాకు అండగా ఉంటానని బలం ఇస్తున్న  మీలాంటి ప్రజానాయకుడు మన ప్రాంతానికి అవసరమని, గతంలో మేము గెలిపించిన నాయకులు ఎవరు కూడా

గత వారం రోజులుగా మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదని,

ఈసారి ఎప్పుడూ ఎన్నికలు వచ్చినా కూడా మీకే మద్దతుగా వుంటామని  మక్కాన్  సింగ్ రాజ్ ఠాకూర్ కు ఎన్ టి పి సి పి కే రామయ్య కాలనీ ప్రజలు భరోసానిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: