మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

రామగుండం పట్టణంలోనీ జెన్ కో రామశక్తి మైదానం లో జరిగిన క్రికెట్ రామగుండం ప్రీమియర్ లీగ్ 2023 ఫైనల్ మ్యాచ్ ను గోదావరిఖని టీమ్ గెలుచుకుంది.  బిజెపి రాష్ట్ర నాయకుడు కౌశిక హరి  బ్యాటింగ్ చేసి ఫైనల్ మ్యాచ్ ను ప్రారంభించారు. ముందుగా టాస్ గెలిచిన రామగుండం ప్రీమియర్ లీగ్ ఆర్గనైజింగ్ టీమ్ నిర్ణీత 15 ఓవర్ లలో 98 పరుగులను చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన గోదావరిఖని టీం సునాయాసంగా పరుగులను ఛేదించి ఫైనల్ మ్యాచ్ కైవసం చేసుకుంది. ఈ క్రికెట్ టోర్నమెంట్ కు ముఖ్య అతిథి గా విచ్చేసిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 22వ డివిజన్ కార్పొరేటర్ కౌశిక లత విజేతలుగా నిలిచిన గోదావరిఖని టీంకు 40 వేల రూపాయలు విన్నర్ కప్ ను అందించారు. అలాగే రన్నరప్ గా నిలిచిన రామగుండం ప్రీమియర్ లీగ్ ఆర్గనైజింగ్ టీంకు 20వేల రూపాయలు రన్నరప్ కప్ ను అందించారు. అనంతరం కార్పొరేటర్ కౌశిక లత మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించేందుకే 60 వేల రూపాయలు స్పాన్సర్ చేయడం జరిగిందని అలాగే క్రికెట్ తో పాటు పుట్ బాల్ , కబడ్డీ , వాలీ బాల్, బ్యాడ్మింటన్ లాంటి క్రీడలను కూడా ప్రోత్సహించాలని అన్నారు. యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా ఉండడానికి కూడా క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని ఇప్పుడున్న పరిస్థితులలో చదువుతోపాటు యువతీ యువకులకు క్రీడా నైపుణ్యం కూడా ఉండాలని ఆమె తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జెన్ కో బి థర్మల్ విద్యుత్ కేంద్ర ఈ ఈ సూర్యనారాయణ , ఏ డి ఈ సయ్యద్ భాష , లగిశెట్టి రవి , నూనె రాజు , కౌశిక భరత్ తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: