మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
తెలంగాణ రాష్ట్రంలోని పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు భారం కావద్దని భావించి దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కల్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశ పెట్టి ఒక లక్షా నూట పదహార్రూపాయాలు అందిస్తున్న పేదోళ్ల దేవుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 45డివిజన్ లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటాన్ని లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్వయంగా అందించారు. లీల శిరీష కి కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కార్పొరేటర్ కొమ్ము వేణు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సంక్షేమం ప్రతి ముఖాల్లో ఆనందం నింపడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గొప్ప పరిపాలన సాగిస్తున్నారని అన్నారు.పేద కుటుంబాల్లో అనందం నింపుతున్న పధకం కళ్యాణ లక్ష్మి అన్నారు. రామగుండం నియోజకవర్గంలో మాంజూరైనా కళ్యాణ లక్ష్మీ లబ్ధిదారులు చెక్కులతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటం ఇంటింటికి వెళ్లి అందిస్తు లబ్ధిదారులు ముఖాల్లో అనందం చూస్తున్నమన్నారు.ఈ కార్యక్రమాల్లో తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: