May 2025
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

 రాజీవ్ యువ వికాసం పథకం క్రింద లాభసాటి వ్యాపార యూనిట్లు ఏర్పాటు చేసి పక్కాగా గ్రౌండింగ్ జరిగేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. 

బుధవారం రాజీవ్ యువ వికాసం అమలు పై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామ కృష్ణా రావు హైదరాబాద్ లోని సచివాలయం నుంచి అన్ని జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పి


. ప్రావిణ్య పాల్గొన్నారు.

రాజీవ్ యవ వికాసం పథకం అమలుకు సంబంధించి చేపట్టిన చర్యలను అధికారులు వివరించారు. 

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, గతంలో ప్రభుత్వాలు కార్పొరేషన్ ద్వారా మొక్కుబడిగా పథకాలు అమలు చేశాయని, తమ ప్రభుత్వం లక్షలాది మంది యువతకు స్వయం ఉపాధి కల్పించాలని చిత్తశుద్ధితో రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేస్తుందని అన్నారు. 

యువ వికాసం పథకం క్రింద వచ్చే సహాయంతో యువత వ్యాపారం చేసి లబ్ది పోందాలని, 8 వేల కోట్ల రూపాయలతో దాదాపు 5 లక్షల మంది యువత ను వ్యాపార వేత్తలుగా మారుస్తున్నామని, ప్రభుత్వం పెట్టే ప్రతి పైసా పెట్టుబడి ఎలా పనిచేస్తుందో రెగ్యులర్ గా మానిటరింగ్ చేయాలని, రాష్ట్ర జీడిపి వృద్ధి లో ఈ పథకం భాగస్వామ్యం కావాలని అన్నారు.

ప్రభుత్వము మంజూరు చేసిన యూనిట్ల గ్రౌండింగ్ చేసిన తర్వాత వాటి పని తీరు పర్యవేక్షించేందుకు జిల్లాలో కమిటీ ఏర్పాటు చేయాలని అన్నారు. మే 29, 30 తేదీలలో జరిగే ఇంచార్జి మంత్రి వర్యుల సమావేశాలలో రాజీవ్ యువ వికాసం పై చర్చించి తుది జాబితా ఆమోదం చేయాలని అన్నారు. జూన్ 2 నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవ నాడు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, అందులో యువ వికాసం లబ్దిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేయాలని డిప్యూటీ సీఎం సూచించారు.

బీసీ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,రాజీవ్ యువ వికాసం పథకం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, లబ్దిదారుల ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రస్తుతం ఎంపిక చేసే లబ్దిదారులకు అవసరమైన శిక్షణ సంపూర్ణంగా అందించిన తర్వాత యూనిట్ గ్రౌండింగ్ పై దృష్టి పెట్టాలని అన్నారు.ప్రభుత్వం చేసే ఖర్చు పూర్తి స్థాయిలో సద్వినియోగం కావాలని , ఒకే రకమైన యూనిట్లు గ్రౌండ్ కాకుండా చూడాలని అన్నారు. వాహనాలు, ట్రాలీలు, కిరాణా షాపు వంటి యూనిట్ల తక్కువగా గ్రౌండ్ చేయాలని అన్నారు.  

ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు మాట్లాడుతూ,6250 కోట్ల సబ్సిడీ, 1667 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు మొత్తం దాదాపు 8 వేల కోట్ల రూపాయలతో 5 లక్షల మంది యువతకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. ప్రభుత్వ అందించే సహాయంతో యువత స్వయం ఉపాధి పోందాలని, రాజీవ్ వివో వికాసం ద్వారా ఆర్థిక ప్రగతి జరగాలని, యువతకు ఉపాధి అవకాశాలు జరగాలని ఆర్థిక జిల్లా కలెక్టర్లు యూనిట్ గ్రౌండింగ్ చేయాలని సీఎస్ సూచించారు.

ఒకే రకమైన యూనిట్ల మంజూరు కాకుండా జాగ్రత్తలు వహించాలని, మనం మంజూరు చేసే యూనిట్ క్షేత్రస్థాయిలో వయబుల్ కావాలని అన్నారు. 

ఈ సమావేశంలో జి డబ్ల్యూ ఎం సి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ఇన్చార్జి అదనపు కలెక్టర్ లు వైవి గణేష్, మేన శ్రీను, ఈ డి ఎస్సి కార్పొరేషన్ బాలరాజు, సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ 

ఉమ్మడి వరంగల్;

హనుమకొండ లో విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటుకు హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు.

బుధవారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్ సమీపంలోని పాత ఆర్ అండ్ బీ క్వార్టర్స్ భవన సముదాయం ఆవరణలో ప్రతిపాదిత 33/11కె వి సబ్ స్టేషన్ ఏర్పాటు కు ఆర్ అండ్ బీ, విద్యుత్, రెవెన్యూ అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. 

స్థల విస్తీర్ణం, భవన వివరాలను ఆర్ అండ్ బీ ఈఈ సురేష్ బాబు ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. స్థలానికి సంబంధించిన మ్యాపును కలెక్టర్ పరిశీలించారు.  

ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఎస్ఈ మధుసూదన్, డీఈ సాంబరెడ్డి, రెవెన్యూ, ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాస శర్మ 

ఉమ్మడి వరంగల్;

కాళేశ్వరం లో సరస్వతి పుష్కరాలు అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం అయ్యాయని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.

సరస్వతి పుష్కరాలు విజయవంతంపై బుధవారం ఐడిఓసి కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాలకు 30.లక్షల మందికి పైగా భక్తులు వచ్చారని తెలిపారు. పుష్కరాలు ఏర్పాట్లు పై నిరంతరం ప్రభుత్వ మార్గదర్శనం.

మేరకు సమీక్షలు నిర్వహించి దిశానిర్దేశం చేసిన ప్రకారం జిల్లా యంత్రాంగం సర్వం సన్నదం చేసినట్లు తెలిపారు. సరస్వతి ఘాట్ వద్ద సరస్వతి మాతా విగ్రహం ఏర్పాటు చేశామని తెలిపారు. హారతి ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసి ప్రతి రోజు కాశీ పూజారులచే సరస్వతి నవరత్న మాలా హారతి నిర్వహించామని తెలిపారు. భక్తులు నదిలోకి వెళ్లకుండా బారికేడింగ్ ఏర్పాటు చేసి ప్రతి 50 మీటర్లకు ఒక గజ ఈతగాళ్ళును పెట్టినట్లు తెలిపారు. సింగరేణి రెస్క్యూ టీము, ఎస్డీఆర్ 

ఎఫ్, ఎన్దిఆర్ఎఫ్ టీములు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహణకు సెక్టార్లు, జోన్స్ ఏర్పాటు చేసి పర్యవేక్షణకు అధికారులను నియమించినట్లు తెలిపారు. టెంట్ సిటీ ఏర్పాటు ద్వారా 40 రూములు, 200 డార్మెటరీ, ఫుడ్ కోర్టు, కిడ్స్ ప్లే జోన్, వాహన పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తాత్కాలిక బస్ స్టాండ్ ఏర్పాటు ద్వారా భక్తులను ఘాట్ వరకు, ఘాట్ నుండి బస్ స్టాండ్, దేవాలయం సమీపం వరకు ఉచిత సేవలు అందించినట్లు తెలిపారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు ద్వారా అత్యవసర వైద్య సేవలు అందించామని తెలిపారు. వర్షం వల్ల అవాంతరాలు వచ్చినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేశామని తెలిపారు. చలి వేంద్రాలు ఏర్పాటు ద్వారా మంచినీరు సరఫరా చేసినట్లు తెలిపారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు మజ్జిగ, మంచినీరు సరఫరా చేయడంతో పాటు క్యూ లో ఉన్న భక్తుల సౌకర్యార్థం కూలర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎప్పటి కపుడు భక్తులతో ముకాముఖీ అవుతూ చెప్పిన సమస్యలు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకున్నామన్నారు.

సమాచార కేంద్రాలు ఏర్పాటు ద్వారా తప్పి పోయిన భక్తుల, ఇతర సమాచారం అందించినట్లు తెలిపారు. వ్యర్థాలు నిర్వహణకు కాళేశ్వరంలో ఇన్సినరేటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పుష్కరాల నిర్వహణ చాలా సంతృప్తిని ఇచ్చినట్లు తెలిపారు. ఈ అనుభవం రాబోవు గోదావరి పుష్కరాలు నిర్వహణకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.

ఎస్పి కిరణ్ ఖరే మాట్లాడుతూ 3 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాళేశ్వరం చిన్న గ్రామమని లక్షల్లో భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేశామని తెలిపారు. 90 షటిల్ బస్సులు ఏర్పాటు ద్వారా భక్తులను బస్ స్టాండ్ నుండి ఘాట్ వరకు ఉచితంగా రవాణా చేసినట్లు తెలిపారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతమని, చాలా ప్రామాణికంగా తీసుకుని బందోబస్తు నిర్వహించామన్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్ రాష్ట్ర పోలీసుల సమన్వయంతో పటిష్ట పోలీస్ పహారా నిర్వహించామని అన్నారు. పార్కింగ్ స్థలాలు, హోల్డింగ్ పాయింట్లు సరిపడ ఏర్పాటు చేసినప్పటికీ, అటవీ ప్రాంతం కావడం, మధ్యలో భారీ వర్షం రావడం జరిగిందని, తద్వారా ట్రాఫిక్ కు ఇబ్బందులు ఎదురైనా, అధిగమించామని అన్నారు. అటవీ ప్రాంతం కావడం వల్ల పార్కింగ్ ఏరియాలు ఏర్పాటు చేయుటకు ఇబ్బందులు వచ్చాయని అన్నారు. అధిక ఉష్ణోగ్రతలు, వర్షం వల్ల ఇబ్బందులు వచ్చినా 24 గంటలు పనిచేశామని తెలిపారు. సరస్వతీ పుష్కరాలు అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం అయినందుకు ధన్యవాదాలు తెలిపారు.

లక్షలాదిమంది భక్తులు పుష్కరాలకు వచ్చిన ఎలాంటి తొక్కిసలాట లేకుండా, శాంతిభద్రతలపరంగా పటిష్ట భద్రత ఏర్పాట్లను ఏర్పాటు చేశామని, 200 సీసీ కెమెరాలతో కాళేశ్వరం సరస్వతి పుష్కరాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేశామని, పుష్కరాల్లో దొంగతనాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని, మహిళా భక్తుల రక్షణ కోసం మఫ్టీలో మహిళా పోలీసులను, షీ టీంలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. తన 8 సంవత్సరాలు సర్వీస్ లో ఇదొక మంచి అనుభవంగా ఉపయోగపడుతుందని తెలిపారు. వివిఐపిలు, వీఐపీలు వచ్చారని అయినా పటిష్ట బందోబస్తు నిర్వహించామని అన్నారు. సరస్వతి పుష్కరాలకు మీడియా విస్తృత ప్రచారం కల్పించినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, 

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఎఎస్పీ బోనాల కిషన్, డిపిఆర్ఓ శ్రీనివాస్, కాటారం డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి తదితరులు. పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం మండలంలోని దామెర కుంట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ ఇటీవల మరణం చెందిన గౌడ సంతోష్ పిఆర్టియు టీఎస్ క్రియాశీల  సభ్యునికి వారి గృహంలో శాసనమండలి సభ్యులు  పింగిలి శ్రీపాల్ రెడ్డి ఒక లక్ష 70 వేల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు . ఈ సందర్భంగా శ్రీపాల్ రెడ్డి  మాట్లాడుతూ PRTUTS లో  సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి సంఘం రక్షణ కవచంగా ఉంటుందని , అలాగే సంతోష్  కుటుంబానికి రావలసిన ఆర్థిక ప్రయోజనాలు ఉద్యోగ కల్పన ఇప్పించే బాధ్యత తనదేనని , రాబోయే కాలంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు నగదు రహిత చికిత్స అందించే హెల్త్ పాలసీని రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగ ,ఉపాధ్యాయులకు కాంట్రాక్టు సిబ్బందికి  అందరికీ వర్తింపజేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసి ఉత్తర్వులు ఇప్పిస్తానని పేర్కొన్నారు  గత ప్రభుత్వ హయాంలో సిపిఎస్ ఉద్యోగులకు డెత్ గ్రాట్యూయిటి మరియు ఫ్యామిలీ పెన్షన్ PRTU సంఘం ఇప్పిచ్చిందని , రాబోయే కాలంలో ప్రస్తుత ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయించి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించేలా   ప్రభుత్వాన్నీ ఒప్పిస్తానని తెలియజేశారు . గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల  ప్రకారం కారుణ్య నియామకం ఉద్యోగి మరణించిన నెలలోపు వారి కుటుంబ సభ్యులకు వచ్చేలా కృషి చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రేగూరి సుభాకర్  రెడ్డి , కుసునపు కిరణ్ కుమార్ హనుమకొండ అధ్యక్షులు మందల  తిరుపతిరెడ్డి , కాటారం మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆంగోత్  రవీందర్ ,అనపర్తి తిరుపతి భూపాలపల్లి మండల అధ్యక్షులు హరిప్రసాద్ , రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు బాబురావు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నందున ముక్తేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. అయితే, ఇక్కడ భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రూ.100 టిక్కెట్ కొన్న భక్తులను, సాధారణ (ధర్మ) దర్శనానికి వచ్చిన భక్తులను ఒకే క్యూ లైన్‌లో నిలబెట్టడంతో గందరగోళం నెలకొంది.

చాలామంది భక్తులు గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సి వస్తోంది. చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు ఈ పరిస్థితిలో చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి నిలబడటం కష్టంగా ఉండటంతో అసౌకర్యానికి గురవుతున్నారు. సరైన ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కొందరు భక్తులు మాట్లాడుతూ, "మేము రూ.100 టిక్కెట్ కొన్నా కూడా సాధారణ క్యూలోనే నిలబడాల్సి వస్తోంది. దీనివల్ల సమయం వృథా అవుతోంది. ప్రత్యేక క్యూ లైన్ ఉంటే త్వరగా దర్శనం చేసుకునే అవకాశం ఉండేది" అని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు, ధర్మ దర్శనానికి వచ్చిన భక్తులు కూడా ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుండటంతో నిరాశ చెందుతున్నారు. అందరినీ ఒకేసారి క్యూలో పంపడం వల్ల ఆలస్యమవుతోందని వారు అంటున్నారు.

ఈ సమస్యపై వెంటనే స్పందించాలని భక్తులు దేవాలయ అధికారులను కోరుతున్నారు. టిక్కెట్ కొన్నవారికి ప్రత్యేకంగా ఒక క్యూ లైన్‌ను, ధర్మ దర్శనం చేసుకునేవారికి మరొక క్యూ లైన్‌ను ఏర్పాటు చేస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

దేవాలయ అధికారులు ఈ సమస్యను ఎంత త్వరగా పరిష్కరిస్తారో చూడాలి. భక్తుల యొక్క ఈ ఇబ్బందులు ఎప్పుడు తొలగిపోతాయో వేచి చూడాలి.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

భూపాలపల్లి జిల్లాలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని, అధిక లోడుతో లారీలు తిరుగుతున్నాయని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ నేత మారపల్లి మల్లేశ్, వైఎఫ్ఎ నేత బాపు యాదవ్ ఆరోపించారు. కాటారంలో ఇసుక క్వారీలు అక్రమంగా నడుస్తున్నాయని, వాటి లైసెన్సులు రద్దు చేయాలని, సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.

అధిక లోడుతో వెళ్తున్న లారీల వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు. తక్షణమే స్పందించి అక్రమ రవాణాను అరికట్టాలని, అధిక లోడుతో తిరుగుతున్న లారీలపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ సమస్యపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని వారు విజ్ఞప్తి చేశారు.

మారపల్లి మల్లేశ్ మాట్లాడుతూ, "కాటారం ప్రాంతంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతున్నారు. దీనివల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోంది. స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు" అని అన్నారు. బాపు యాదవ్ మాట్లాడుతూ, "అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. రాజకీయ అండదండలతోనే ఈ అక్రమ దందా కొనసాగుతోంది. వెంటనే దీనిపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం" అని హెచ్చరించారు. ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ, అక్రమ తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, లారీల రాకపోకల వల్ల దుమ్ము ధూళితో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ప్రజలను కూడగట్టి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ లిబరేషన్, వైఎఫ్ఎ కార్యకర్తలు పాల్గొన్నారు.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అర్హులైన నిరుపేదలను ఎంపిక చేయాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి. పి. గౌతమ్ అన్నారు. బుధవారం హనుమకొండ కుడా కార్యాలయంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, జీడబ్ల్యూఎంసి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణి లతో కలిసి ఇందిరమ్మ ఇండ్లు పథకం లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ పై వెరిఫికేషన్ అధికారులతో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి. పి. గౌతమ్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 


జిల్లాలోని గ్రామాల, గ్రేటర్ వరంగల్ నగరంలోని వార్డుల వారీగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో పాటిస్తున్న వేరిఫికేషన్ ప్రక్రియ, అర్హులు, అనర్హుల జాబితాను ఎలా గుర్తిస్తున్నారు, ఇండ్ల నిర్మాణం ఎలా జరుగుతుంది, ఏవైనా సమస్యలు ఎదురవుతున్నాయి, తదితర అంశాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి. పి.గౌతమ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఉన్న డేటా తో వెరిఫికేషన్ క్షేత్ర స్థాయిలో  సరిచూసుకున్న తరువాతనే నియోజక వర్గ నోడల్ అధికారి ద్వారా జాబితాను కలెక్టర్ లాగిన్ కు పంపాలన్నారు. పైలట్ గ్రామాలలో ఇప్పటి వరకు ఇండ్లు ప్రారంభం కాని వారి స్థానంలో ఇతర గ్రామానికి చెందిన వారిని ఎంపిక చేస్తామన్నారు. వర్ధన్నపేట పరిధిలో పలు ఇండ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేస్తున్నట్లు వెరిఫికేషన్ అధికారి చెప్పడంతో హౌసింగ్ ఎండీ గౌతమ్ అభినందనలు తెలిపారు. లబ్ధిదారు వేగంగా ఇల్లు నిర్మాణంలో స్లాబ్ పూర్తి చేసుకోవడం నిజంగా అభినందనీయమన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను ప్రాతిపాదికగా తీసుకోవాలని వెరిఫికేషన్ అధికారులకు సూచించారు. లబ్దిదారుడు  సరసమైన ధరలో  దశలవారీగా

ఇండ్ల నిర్మాణం చేసుకునేలా

ప్రతి దశలో అధికారులు తప్పనిసరిగా పర్యవేక్షించాలని అన్నారు. 

ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియమించబడిన

ఏఈ లను  ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించాలని,  ఆ తదుపరి త్వరలో నగరంలో చేపట్టే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పర్యవేక్షణకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

హనుమకొండ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వార్డులలో అనర్హుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే ఇందిరమ్మ కమిటీ దృష్టికి తీసుకెళ్లి, ఆ తదుపరి చర్యలు చేపట్టాలన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లోని పలు వార్డుల్లో జాబితా వెరిఫికేషన్ ఎలా జరుగుతుందనే వివరాలను వార్డు అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న దృష్ట్యా లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ సామగ్రి ఖర్చులు భారం కాకుండా ఉండేందుకు  మాట్లాడనున్నట్లు తెలిపారు. కార్మిక శాఖ అధికారులు, మండలాల  తాపీ మేస్త్రి సంఘాలతో త్వరలో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల జాబితా వెరిఫికేషన్ లో అర్హులు, అనర్హుల జాబితాను సరిచూసుకోవాలన్నారు.వరంగల్ జిల్లాతో పాటు  వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లోని పలు వార్డుల్లో జాబితా వెరిఫికేషన్ ఎలా జరుగుతుందనే వివరాలను వార్డు అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

అంతకుముందు గ్రేటర్ వరంగల్ పరిధిలోని సోమిడి, వడ్డేపల్లి, దేశాయిపేట ప్రాంతాల్లో వేరిఫికేషన్ అధికారులు నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఎండి విపి గౌతమ్ బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాఖేడే తో కలసి క్షేత్ర స్థాయిలో పరిశీలించి పారదర్శక నిర్వహణకు అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ఇందిరమ్మ ఇండ్ల చీఫ్ ఇంజనీర్ చైతన్య కుమార్,  జిల్లా నోడల్ అధికారులు రామిరెడ్డి, రవీందర్ నాయక్, నియోజకవర్గ నోడల్ అధికారులు, వెరిఫికేషన్ అధికారులు తదితరులు, సిబ్బంది పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారంలో ఒక మహిళపై గొడ్డలితో దాడి జరగడం కలకలం రేపింది. హైటెక్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదు గుంటల భూమికి సంబంధించిన వివాదంలో హత్యకు గురైన వ్యక్తి కుమారుడు నిందితురాలిపై దాడి చేశాడు.

కాటారం మండలం దేవరాంపల్లి గ్రామానికి చెందిన మారుపాక లచ్చక్క (42) అనే మహిళ, మారుపాక సారయ్యను హత్య చేసిన కేసులో నిందితురాలు. ఆమెను అరెస్టు చేయగా, కొద్ది రోజుల క్రితం షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యారు. ప్రతి మంగళవారం కాటారం పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేయాల్సి ఉంది.

ఆ విధంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి తిరిగి వెళ్తున్న లచ్చక్కపై అంజి అనే యువకుడు గొడ్డలితో దాడి చేశాడు. చుట్టుపక్కల వారు అడ్డుకోవడంతో లచ్చక్కకు గాయాలయ్యాయి. ఆమెను వెంటనే భూపాలపల్లి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

దేవరాంపల్లి గ్రామంలో ఐదు గుంటల భూమి విషయంలో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్ 14న సారయ్యను లచ్చక్కతో పాటు మరో ముగ్గురు దారుణంగా హత్య చేశారు. ఈ హత్యకు గురైన సారయ్య కుమారుడు అంజి, తల్లి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని పథకం వేశాడు. సరైన సమయం కోసం వేచి చూసి, మంగళవారం పోలీస్ స్టేషన్ ఎదుటే లచ్చక్కపై దాడి చేశాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్;

 

హనుమకొండ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలలో  వివిధ వసతుల కల్పనకు చేపట్టిన అభివృద్ధి పనులను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని  హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో సంబంధిత శాఖల అధికారులతో జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనుల పురోగతిని గురించి  జిల్లా కలెక్టర్ కు అధికారులు వివరించారు. 


అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో చేపట్టిన విద్యుత్తు, తాగునీరు, టాయిలెట్స్ పనులను పూర్తి చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో ఈజీఎస్ ద్వారా చేపట్టిన కిచెన్ షెడ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి జయంతి, జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, ముఖ్య ప్రణాళిక అధికారి  సత్యనారాయణ రెడ్డి, ఇతర అధికారులు, సీడిపి ఓలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

 రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తీసుకువచ్చిన భూభారతి చట్టం ఆధారంగా భూ సమస్యలు  పరిష్కారం అవుతాయని  పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు.

మంగళవారం హనుమకొండ జిల్లా నడికూడ మండలం సర్వాపూర్, ముస్త్యాలపల్లి  గ్రామాల లో  భూభారతి చట్టంపై  రెవెన్యూ సదస్సులను  అధికారులు నిర్వహించారు. 

ఈ రెవెన్యూ సదస్సులకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ భూభారతి రెవెన్యూ సదస్సుకు జిల్లాలో నడికూడ మండలాన్ని ఎంపిక చేయడం సంతోషకరమన్నారు. రెవెన్యూ సదస్సులో రైతులు అందించే విజ్ఞప్తులను పరిశీలించి పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.  స్వాతంత్ర్య  భారతదేశంలో 1954లో కాస్ర పహాణి ద్వారా భూ రికార్డులకు సంబంధించి బేస్ డాక్యుమెంట్ ఉండేదన్నారు. 2020 లో ధరణి చట్టాన్ని తీసుకువచ్చారని అన్నారు. గతంలో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేదిగా కొత్తగా తీసుకువచ్చిన ధరణి చట్టం ఉండాలి కానీ దాని ద్వారా భూ సమస్యలు ఇంకా ఎక్కువ అయ్యాయని అన్నారు. ధరణి చట్టం గ్రామాలలో భూ సమస్యలు కుటుంబాల మధ్య విభేదాలకు కారణమైందన్నారు. గతంలో భూ రికార్డులలో పట్టాదారులు ఉన్నప్పటికీ ఖాస్తు కాలమ్ లో అనుభవదారు కాలమ్ ఉండేదన్నారు. ధరణి అమల్లోకి వచ్చిన తర్వాత అనుభవదారు కాలమ్ ను తీసేసారని అన్నారు. అనుభవదారు కాలమ్ తీసివేయడం పెద్ద తప్పిదమన్నారు.   ఇందిరమ్మ ప్రభుత్వం రావడానికి రైతులు ప్రధాన భూమిక పోషించారని అన్నారు. పైలెట్ గా ఎంపికైన నడికూడ  మండలంలో రైతులు సూచించిన సమస్యలను క్రోడీకరించి ఈ నెల చివరినాటికి ఈ గ్రామాలకు సంబంధించి భూ సమస్యలను తహసిల్దార్ ఆర్డీవోలు తగిన పరిష్కారానికి చర్యలు చేపడతారని అన్నారు. సర్వేయర్లు లేకపోవడంతో అనేక చోట్ల సర్వే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, దీనిలో భాగంగానే ప్రత్యేకంగా సర్వేయర్లను  నియమిస్తున్నారని తెలిపారు.  కలెక్టర్ స్థాయిలోనే  భూ సమస్యలు పరిష్కారం కావాలన్నారు. 1954 లో వచ్చిన కాస్రా పహాని  బేస్ గా ఉందో అదేవిధంగా భూభారతి చట్టం  భూ సమస్యల నమస్కారానికి బేస్ గా ఉండాలనేది  ప్రభుత్వ ఉద్దేశమని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. 

 

హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు పెట్టుకున్న రైతులకు వారి చుట్టుపక్కల ఉన్నవారికి  నోటీసులు అందించి  క్షేత్రస్థాయిలో విచారించి నెలాఖరు వరకు పరిష్కారమవుతాయన్నారు. పైలెట్ మండలంలో ఉన్న నడికూడ మండలంలో 90 శాతం వరకు  భూ సమస్యలు నెలాఖరు వరకు పరిష్కారమవుతాయన్నారు.  మిగిలిన 10 శాతం సమస్యలను కూడా పరిష్కరించేందుకు  చర్యలు చేపడతామన్నారు. సమస్యలు ఉన్న రైతులు అర్జీలను అందించాలని కలెక్టర్ సూచించారు. 

ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డిఓ డాక్టర్ నారాయణ, హనుమకొండ  డిప్యూటీ కలెక్టర్ మంగీలాల్, నడికూడ తహసిల్దార్  నాగరాజు, ఇతర అధికారులతో పాటు స్థానిక  రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ 

ఉమ్మడి వరంగల్ ;

సమాజాభివృద్ధి కార్యక్రమంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కృష్ణదేవరాయలు కోరారు . విద్యార్థి దశలో మరుపురాని జ్ఞాపకాలను నెమరువేసుకునే ఆత్మీయ సమ్మేళనం ఎన్నటికీ మరువలేమని అన్నారు. హన్మకొండలోని భీమారంలో ఉన్న వి.ఆర్ కన్వెన్షన్ లో సోమవారం నాడు జరిగిన ధర్మసాగర్ మండలంలోని పెద్ద పెండ్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన 1974 -75 సంవత్సరం ఎస్ ఎస్ సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.నల్సార్ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కృష్ణదేవరాయలు పెద్ద పెండ్యాల జిల్లా పరిషత్ పూర్వ విద్యార్థి కావడం తో పాటుగా సమావేశానికి హాజరు కావడం ఈ సమ్మేళనానికి శోభనిచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి ఈ పాఠశాల లో చదివిన పూర్వ విద్యార్థులు కృషి చేయాలని కోరారు. 60 ఏళ్ల పిదప విశ్రాంతి తీసుకోకుండా సమాజాభివృద్ధి లో భాగస్వామి కావాలని ఆయన కోరారు. పెద్ద పెండ్యాల జిల్లా పరిషత్ పూర్వ విద్యార్థి యైన తాను ఈ సమ్మేళనంలో పాల్గొనడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు.

పూర్వ విద్యార్థులంతా తమ వయసుని పక్కన పెట్టి ఈ కార్యక్రమం లో పాల్గొని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పెద్ద పెండ్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1974-75 సంవత్సరపు ఎస్ ఎస్ సి బ్యాచ్ విద్యార్థులైన ప్రముఖ వ్యాపార వేత్త మామిడాల సురేందర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల రిటేర్డ్ ప్రిన్సిపాల్ ఉపేందర్,1974-75 సంవత్సర విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్ వి కర్ణన్   ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్  వి.జ్యోతిర్మయి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ రోహిత్ రెడ్డి ,స్వాతి, శ్రీషికలతో  కూడిన బృందం హనుమకొండ పట్టణంలో గల ఫుడ్ ఆన్ ఫైర్, ల్యాండ్ మార్క  రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ రెస్టారెంట్ల నందు వంట గది పూర్తిగా అపరిశుభ్రంగా ఉండడం, మురికితో దుర్వాసన కలిగిన రిఫ్రిజిరేటర్ లో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల ప్రకారం సరైన ఉష్ణోగ్రతను మైంటైన్ చేయకపోవడమ్, మరియు  సుమారు 45వేల రూపాయల  విలువ కలిగిన 32 కిలోల నిలువ చేసిన కుళ్ళిన మాంసపు ఉత్పత్తులను, హానికర ప్రమాదకరమైన రంగులను కలిపిన  చికెన్  కాలం చెల్లిన ఐస్ క్రీములు, పాల ప్యాకెట్లు, మసాలాపొడులు,లేబుల్ డిఫెక్ట్స్ కలిగిన కార్న్,కొబ్బరి పొడి మరియు ఇతర ఆహార ముడి సరుకులు మరియు, ఫంగస్ తో కూడుకున్న కాలీఫ్లవర్,క్యాబేజీ వంటి కూరగాయలను,

  గుర్తించడం, బిర్యానీ మరియు ఇతర ప్రాసెస్డ్ ఫుడ్స్ తయారీలో మోతాదును మించి హానికర రసాయనాలతో కూడిన రంగులను వాడటం,హోటల్ యాజమాన్యం పై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్ అయిన వి. జ్యోతిర్మయి  తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ,అప్పటికప్పుడే ప్రజల ఆరోగ్యానికి భంగం కలగకూడదని వాటిని ధ్వంసం చేసి ఎఫ్ ఎస్ ఎస్ 2006, చట్టాన్నిఉల్లంఘించినందుకు నోటీసులు జారీ చేయడం జరిగింది మరియు అనుమానిక శాంపిలను సేకరించి హైదరాబాద్లో గల ల్యాబ్ పంపడం నివేదిక ఆధారంగా కల్తీ అనే నిర్ధారణ అయితే వారిపై చట్టరీత్య చర్యలు ఉంటాయని తెలిపారు.

 

ఈ రకమైన ప్రజారోగ్యంతో చెలగాటమాడే ఆహార తయారీదారులు మరియు ఆహారం అమ్మేవారు ఆహార పరిరక్షణ ప్రమాణాలను పాటించి, ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా  ఆహారాన్ని ప్రజలకు విక్రయించాలని  హెచ్చరిస్తూ లేనియెడల చట్ట ప్రకారం  క్రిమినల్ కేసులు నమోదు చేస్తూ అవసరమైతే సంబంధిత శాఖ సహాయంతో  సీజ్ కూడా చేస్తామని  హెచ్చరించడం   జరిగింది. ఆహారాన్ని తయారుచేసి, నిలువ చేసి,రవాణా చేసి ప్రజలకు అమ్మే  వ్యాపారస్తులు కల్తీల పట్ల  అవగాహన పెంచుకోవాలని,  ప్రజలకు స్వచ్ఛమైన శుచి, శుభ్రత గల ఆహార పదార్థాలను మరియు ఆహార వ్యాపారులు సరైన  బాధ్యతతో వ్యవహరించాలని, సురక్షితమైన కల్తీ లేని ఆహారాన్ని ప్రజలకు అందించవలసిందిగా  వ్యాపారస్తులను టాస్క్ఫోర్స్ టీం హెడ్  వి.జ్యోతిర్మయి సూచించారు. ఈ నిబంధనలు పాటించని యెడల చట్ట ప్రకారం శిక్షకు గురి కాబడతారని హెచ్చరించడం జరిగింది.

ఈ టాస్క్ ఫోర్స్ దాడులలో అధికారులతో పాటు పలువురు సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

సంగారెడ్డి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కొండాపూర్ మండలంలోని మల్కాపూర్లో భార్య తనను విడిచి పుట్టింటికి వెళ్లిపోయిందన్న తీవ్ర మనస్తాపంతో ఓ భర్త అత్యంత దారుణమైన చర్యకు పాల్పడ్డాడు. సొంత పిల్లలైన ఇద్దరు బిడ్డలకు ఉరి వేసి చంపి, ఆ తర్వాత తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకరమైన సంఘటన మల్కాపూర్ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. భార్యాభర్తల మధ్య ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు చిన్న పిల్లలను కోల్పోయిన ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటన స్థానికంగా కలచివేసింది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం మండలంలోని చిదనపల్లిలో జరిగిన ఈ విషాదకరమైన సంఘటన గురించి వినడానికి చాలా బాధగా ఉంది. మార్క రాజేందర్ అనే యువకుడు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఎరువుల దుకాణం నడుపుతూ రైతులకు సుమారు 20 లక్షల రూపాయల వరకు అరువు ఇచ్చాడు. అయితే, రైతులు ఆ డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గత నెల 28న ఇంటి నుండి వెళ్ళిపోయిన రాజేందర్, శనివారం మహాదేవపూర్లోని అయ్యప్ప గుడి సమీపంలో ఒక నీటి ట్యాంక్ వద్ద ఉరి వేసుకొని మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఒత్తిడికి గురవుతారు. ఒకరికొకరు సహాయం చేసుకోవడం, మానసిక మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యం. రైతులకు కూడా సరైన సమయంలో ఆర్థిక సహాయం అందేలా చూడాల్సిన అవసరం ఉంది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడిగడ్డ టీవీ న్యూస్ హనుమకొండ ప్రతినిధి మధు

తెలంగాణ స్టేట్ లీగల్ ఆథారిటీ హైదరాబాద్ పిఎన్ విపిఎస్ యూనివర్సల్ కమ్యూనిటీ మెడిషియన్ సెంటర్ ను హనుమకొండలోని జ్యోతిర్లింగాల నగర్ లో శుక్రవారం జ్యోతిర్లింగాల యూనివర్సల్ కమ్యూనిటీ మీడియేటర్ డాక్టర్ పోరండ్ల ప్రభాకర్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా జడ్జి డాక్టర్ పట్టాభిరామారావు, ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి క్షమా దేశ్ పాండే, కేయూ ఎస్సై పి. సతీష్, తదితరులు పాల్గొన్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


మామనూర్ నాలుగు బెటాలియన్ లో  సయ్యద్ అబ్బాస్ హుస్సేన్,  బి. ఖీమా ఏఆర్ఎస్ఐలుగా విధులు నిర్వర్తించి నేడు పదవి విరమణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధి గా కమాండెంట్  బి.రామ్ ప్రకాష్ గారు హాజరు అయ్యి పదవి విరమణ పొందుతున్న  సయ్యద్ అబ్బాస్ హుస్సేన్, బి. ఖీమా గారికి శాలువ కప్పి సన్మానించారు.తమ సర్వీస్ లో  ఎలాంటి రిమార్క్స్ లేకుండా పదవి విరమణ పొదుతున్నారని మరియు పదవి విరమణ తర్వాత తన కుటుంబంతో సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని తెలపడం జరిగింది.ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ కమాండెంట్స్ క్రిష్ణ ప్రసాద్ , వీరన్న, రిజర్వు ఇన్స్పెక్టర్స్ రవి, రాజ్ కుమార్, అశోక్, కృష్ణ,  అధికారులు మరియు బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలకు నేటి నుండి మే 31 వరకు వేసవి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇప్పటికే పాఠశాలలు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు సెలవులు రావడంతో, ఇప్పుడు డిగ్రీ విద్యార్థులు కూడా వారి సరదా సమయాన్ని గడపడానికి సిద్ధమయ్యారు. హాస్టళ్లలో ఉండే విద్యార్థులు తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. వేసవి వేడిమి నుండి ఉపశమనం పొందడానికి, కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ఇది మంచి అవకాశం. ఈ సెలవులను విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటలకు, ఇతర పొరు కార్యక్రమాలకు కూడా ఉపయోగించుకుంటారని ఆశిద్దాం. తిరిగి కళాశాలలు తెరిచిన తర్వాత ఉత్సాహంగా విద్యాభ్యాసం కొనసాగిస్తారు కదూ! ఈ వేసవి సెలవులు విద్యార్థులకు ఒక గొప్ప విరామంలాంటివి. పరీక్షల ఒత్తిడి, కళాశాల యొక్క రోజువారీ రొటీన్ నుండి వారికి కాస్త ఉపశమనం లభిస్తుంది.ఈ సమయంలో విద్యార్థులు కేవలం విశ్రాంతి తీసుకోవడమే కాకుండా, వారి అభిరుచులను పెంపొందించుకోవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి కూడా ప్రయత్నించవచ్చు. కొంతమంది విద్యార్థులు పెండింగ్‌లో ఉన్న నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు లేదా కొత్త హాబీలను అలవర్చుకోవచ్చు. ఉదాహరణకు, ఒకరు ఒక సంగీత వాయిద్యాన్ని నేర్చుకోవడం ప్రారంభించవచ్చు, మరొకరు ఒక కొత్త భాషను నేర్చుకోవచ్చు లేదా ఇంకొకరు తమలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు చిత్రలేఖనం లేదా కథలు రాయడం వంటి వాటిపై దృష్టి పెట్టవచ్చు. అంతేకాకుండా, ఈ సెలవులు కుటుంబ సభ్యులతో బంధాన్ని మరింత బలపరుచుకోవడానికి ఒక చక్కని అవకాశం. చాలా కాలం తర్వాత ఇంటికి వచ్చిన విద్యార్థులతో తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు సంతోషంగా గడుపుతారు. కలిసి భోజనం చేయడం, విహారయాత్రలకు వెళ్లడం లేదా కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ద్వారా అనుబంధం మరింత పెరుగుతుంది. వేసవి సెలవుల్లో ఆరోగ్యంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. వేడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, విద్యార్థులు తగినంత నీరు త్రాగాలి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి మరియు ఎండలో ఎక్కువగా తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో ఆటలు ఆడటం లేదా వ్యాయామం చేయడం మంచిది. మొత్తానికి, ఈ వేసవి సెలవులు డిగ్రీ విద్యార్థులకు ఒక పునరుత్తేజాన్నిచ్చే సమయం. వారు తిరిగి కళాశాలలకు వచ్చినప్పుడు మరింత ఉత్సాహంతో మరియు నూతన శక్తితో తమ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తారని ఆశిద్దాం. సెలవులను ఆనందించండి మరియు సురక్షితంగా ఉండండి!