మామనూర్ నాలుగు బెటాలియన్ లో సయ్యద్ అబ్బాస్ హుస్సేన్, బి. ఖీమా ఏఆర్ఎస్ఐలుగా విధులు నిర్వర్తించి నేడు పదవి విరమణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధి గా కమాండెంట్ బి.రామ్ ప్రకాష్ గారు హాజరు అయ్యి పదవి విరమణ పొందుతున్న సయ్యద్ అబ్బాస్ హుస్సేన్, బి. ఖీమా గారికి శాలువ కప్పి సన్మానించారు.తమ సర్వీస్ లో ఎలాంటి రిమార్క్స్ లేకుండా పదవి విరమణ పొదుతున్నారని మరియు పదవి విరమణ తర్వాత తన కుటుంబంతో సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని తెలపడం జరిగింది.ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ కమాండెంట్స్ క్రిష్ణ ప్రసాద్ , వీరన్న, రిజర్వు ఇన్స్పెక్టర్స్ రవి, రాజ్ కుమార్, అశోక్, కృష్ణ, అధికారులు మరియు బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.

Post A Comment: