ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ
ఉమ్మడి వరంగల్;హనుమకొండ లో విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటుకు హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు.
బుధవారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్ సమీపంలోని పాత ఆర్ అండ్ బీ క్వార్టర్స్ భవన సముదాయం ఆవరణలో ప్రతిపాదిత 33/11కె వి సబ్ స్టేషన్ ఏర్పాటు కు ఆర్ అండ్ బీ, విద్యుత్, రెవెన్యూ అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు.
స్థల విస్తీర్ణం, భవన వివరాలను ఆర్ అండ్ బీ ఈఈ సురేష్ బాబు ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. స్థలానికి సంబంధించిన మ్యాపును కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఎస్ఈ మధుసూదన్, డీఈ సాంబరెడ్డి, రెవెన్యూ, ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు.

Post A Comment: