ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ
ఉమ్మడి వరంగల్;
తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ రోహిత్ రెడ్డి ,స్వాతి, శ్రీషికలతో కూడిన బృందం హనుమకొండ పట్టణంలో గల ఫుడ్ ఆన్ ఫైర్, ల్యాండ్ మార్క రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ రెస్టారెంట్ల నందు వంట గది పూర్తిగా అపరిశుభ్రంగా ఉండడం, మురికితో దుర్వాసన కలిగిన రిఫ్రిజిరేటర్ లో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల ప్రకారం సరైన ఉష్ణోగ్రతను మైంటైన్ చేయకపోవడమ్, మరియు సుమారు 45వేల రూపాయల విలువ కలిగిన 32 కిలోల నిలువ చేసిన కుళ్ళిన మాంసపు ఉత్పత్తులను, హానికర ప్రమాదకరమైన రంగులను కలిపిన చికెన్ కాలం చెల్లిన ఐస్ క్రీములు, పాల ప్యాకెట్లు, మసాలాపొడులు,లేబుల్ డిఫెక్ట్స్ కలిగిన కార్న్,కొబ్బరి పొడి మరియు ఇతర ఆహార ముడి సరుకులు మరియు, ఫంగస్ తో కూడుకున్న కాలీఫ్లవర్,క్యాబేజీ వంటి కూరగాయలను,
గుర్తించడం, బిర్యానీ మరియు ఇతర ప్రాసెస్డ్ ఫుడ్స్ తయారీలో మోతాదును మించి హానికర రసాయనాలతో కూడిన రంగులను వాడటం,హోటల్ యాజమాన్యం పై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్ అయిన వి. జ్యోతిర్మయి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ,అప్పటికప్పుడే ప్రజల ఆరోగ్యానికి భంగం కలగకూడదని వాటిని ధ్వంసం చేసి ఎఫ్ ఎస్ ఎస్ 2006, చట్టాన్నిఉల్లంఘించినందుకు నోటీసులు జారీ చేయడం జరిగింది మరియు అనుమానిక శాంపిలను సేకరించి హైదరాబాద్లో గల ల్యాబ్ పంపడం నివేదిక ఆధారంగా కల్తీ అనే నిర్ధారణ అయితే వారిపై చట్టరీత్య చర్యలు ఉంటాయని తెలిపారు.
ఈ రకమైన ప్రజారోగ్యంతో చెలగాటమాడే ఆహార తయారీదారులు మరియు ఆహారం అమ్మేవారు ఆహార పరిరక్షణ ప్రమాణాలను పాటించి, ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా ఆహారాన్ని ప్రజలకు విక్రయించాలని హెచ్చరిస్తూ లేనియెడల చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తూ అవసరమైతే సంబంధిత శాఖ సహాయంతో సీజ్ కూడా చేస్తామని హెచ్చరించడం జరిగింది. ఆహారాన్ని తయారుచేసి, నిలువ చేసి,రవాణా చేసి ప్రజలకు అమ్మే వ్యాపారస్తులు కల్తీల పట్ల అవగాహన పెంచుకోవాలని, ప్రజలకు స్వచ్ఛమైన శుచి, శుభ్రత గల ఆహార పదార్థాలను మరియు ఆహార వ్యాపారులు సరైన బాధ్యతతో వ్యవహరించాలని, సురక్షితమైన కల్తీ లేని ఆహారాన్ని ప్రజలకు అందించవలసిందిగా వ్యాపారస్తులను టాస్క్ఫోర్స్ టీం హెడ్ వి.జ్యోతిర్మయి సూచించారు. ఈ నిబంధనలు పాటించని యెడల చట్ట ప్రకారం శిక్షకు గురి కాబడతారని హెచ్చరించడం జరిగింది.
ఈ టాస్క్ ఫోర్స్ దాడులలో అధికారులతో పాటు పలువురు సిబ్బంది పాల్గొనడం జరిగింది.
Post A Comment: