ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ 

ఉమ్మడి వరంగల్ ;

సమాజాభివృద్ధి కార్యక్రమంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కృష్ణదేవరాయలు కోరారు . విద్యార్థి దశలో మరుపురాని జ్ఞాపకాలను నెమరువేసుకునే ఆత్మీయ సమ్మేళనం ఎన్నటికీ మరువలేమని అన్నారు. హన్మకొండలోని భీమారంలో ఉన్న వి.ఆర్ కన్వెన్షన్ లో సోమవారం నాడు జరిగిన ధర్మసాగర్ మండలంలోని పెద్ద పెండ్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన 1974 -75 సంవత్సరం ఎస్ ఎస్ సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.నల్సార్ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కృష్ణదేవరాయలు పెద్ద పెండ్యాల జిల్లా పరిషత్ పూర్వ విద్యార్థి కావడం తో పాటుగా సమావేశానికి హాజరు కావడం ఈ సమ్మేళనానికి శోభనిచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి ఈ పాఠశాల లో చదివిన పూర్వ విద్యార్థులు కృషి చేయాలని కోరారు. 60 ఏళ్ల పిదప విశ్రాంతి తీసుకోకుండా సమాజాభివృద్ధి లో భాగస్వామి కావాలని ఆయన కోరారు. పెద్ద పెండ్యాల జిల్లా పరిషత్ పూర్వ విద్యార్థి యైన తాను ఈ సమ్మేళనంలో పాల్గొనడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు.

పూర్వ విద్యార్థులంతా తమ వయసుని పక్కన పెట్టి ఈ కార్యక్రమం లో పాల్గొని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పెద్ద పెండ్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1974-75 సంవత్సరపు ఎస్ ఎస్ సి బ్యాచ్ విద్యార్థులైన ప్రముఖ వ్యాపార వేత్త మామిడాల సురేందర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల రిటేర్డ్ ప్రిన్సిపాల్ ఉపేందర్,1974-75 సంవత్సర విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: