కాటారం మండలంలోని దామెర కుంట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ ఇటీవల మరణం చెందిన గౌడ సంతోష్ పిఆర్టియు టీఎస్ క్రియాశీల సభ్యునికి వారి గృహంలో శాసనమండలి సభ్యులు పింగిలి శ్రీపాల్ రెడ్డి ఒక లక్ష 70 వేల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు . ఈ సందర్భంగా శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ PRTUTS లో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి సంఘం రక్షణ కవచంగా ఉంటుందని , అలాగే సంతోష్ కుటుంబానికి రావలసిన ఆర్థిక ప్రయోజనాలు ఉద్యోగ కల్పన ఇప్పించే బాధ్యత తనదేనని , రాబోయే కాలంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు నగదు రహిత చికిత్స అందించే హెల్త్ పాలసీని రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగ ,ఉపాధ్యాయులకు కాంట్రాక్టు సిబ్బందికి అందరికీ వర్తింపజేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసి ఉత్తర్వులు ఇప్పిస్తానని పేర్కొన్నారు గత ప్రభుత్వ హయాంలో సిపిఎస్ ఉద్యోగులకు డెత్ గ్రాట్యూయిటి మరియు ఫ్యామిలీ పెన్షన్ PRTU సంఘం ఇప్పిచ్చిందని , రాబోయే కాలంలో ప్రస్తుత ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయించి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించేలా ప్రభుత్వాన్నీ ఒప్పిస్తానని తెలియజేశారు . గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కారుణ్య నియామకం ఉద్యోగి మరణించిన నెలలోపు వారి కుటుంబ సభ్యులకు వచ్చేలా కృషి చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రేగూరి సుభాకర్ రెడ్డి , కుసునపు కిరణ్ కుమార్ హనుమకొండ అధ్యక్షులు మందల తిరుపతిరెడ్డి , కాటారం మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆంగోత్ రవీందర్ ,అనపర్తి తిరుపతి భూపాలపల్లి మండల అధ్యక్షులు హరిప్రసాద్ , రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు బాబురావు పాల్గొన్నారు.
Post A Comment: