ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.
వర్షాకాలం నేపద్యం లో జిల్లా పరిధి లోగల పలు లోతట్టు ప్రాంతాల తో పాటు నాలాలను కలెక్టర్ కమీషనర్ అశ్విని తానాజీ వాకడే హన్మకొండ అదనపు కలెక్టర్ రాధికా గుప్తా లతో కలిసి క్షేత్ర స్థాయి లో పరిశీలించి సమర్థవంతంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు.
ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు తలెత్తితే
ఏ ఏ ప్రాంతాలు ప్రభావితం అవుతాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పర్యటన నేపద్యం లో.ఎస్ బి హెచ్ కాలనీ వడ్డేపల్లి చెరువు జవహర్ కాలనీ సరస్వతి నగర్ అంబేద్కర్ భవన్ రాజాజీ నగర్ ప్రెసిడెన్సీ స్కూల్ నయీం నగర్ బొక్కల గడ్డ అజర హాస్పిటల్ కల్వర్టు భద్రకాళి మత్తడి సమీపం లో క్షేత్ర స్థాయి లో పరిశీలనలు జరిపారు.
నగరం లోని ప్రాంతాలు ముంపునకు గురికాకుండా చూడాలని అవసరం మేరకు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోయడం డిసిల్టింగ్ ప్రక్రియ ను చేపట్టడం కచ్చా కాలువలు తీయడానికి సిబ్బందిని ముందస్తు గా అందుబాటులో ఉంచుకోవాలని అత్యంత ప్రమాదకరం గా ఉన్న ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాలని నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో హార్వెస్టింగ్ (ఇంకుడు గుంతలు)ఏర్పాటు చేసి నీటిని అందులోకి పంపే ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భం గా అధికారులకు సూచించారు.
ఇట్టి కార్యక్రమం లో ఎస్ ఈ కృష్ణారావు సి ఏం హెచ్ ఓ డా.రాజేష్ సిటీ ప్లానర్ వెంకన్న ఆర్ డి ఓ దత్తు బల్దియా ఈ ఈ రాజయ్య ఇరిగేషన్ డి ఈ హర్ష వర్ధన్ బల్దియా డి ఈ లు రవి కుమార్ సంతోష్ బాబు ఏ ఈ లు హరికుమార్ విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;వర్షాకాలంలో డయేరియా ప్రబల కుండా "స్టాఫ్ డయేరియా క్యాంపెయిన్" కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా సంబంధిత అధికారులు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సోమవారం కాన్ఫరెన్స్ హాల్ లో అడిష్ నల్ కలెక్టర్ లు వెంకట్ రెడ్డి, రాధికా గుప్తా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు, సిపిఓ సత్య నారాయణ రెడ్డి ఇతర జిల్లా అధికారులతో కలసి డయేరియా అవగాహన కార్యక్రమాల వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డయేరియా నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు ఆగస్టు 31 వరకు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్య, విద్యా, సంక్షేమ, గ్రామీణ అభివృద్ధి, పురపాలక సంఘాలు, నీటిపారుదల శాఖల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు పకడ్బందీగా చేపట్టాలన్నారు. ప్రతి ఇంటిని సందర్శించి ఐదేళ్లలోపు పిల్లల వివరాలు సేకరించాలని, నీటి విరేచనాల సమస్య ఉన్నట్లయితే ఓఆర్ఎస్ ద్రావణం, వయసు వారిగా జింక్ మాత్రలు, చికిత్స అందించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో, వసతి గృహాల్లో పిల్లలకు భోజనం చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలియజేయాలని, అతిసారా రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిష్ నల్ కలెక్టర్ లు శ్రీ వెంకట్ రెడ్డి, రాధికా గుప్తా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు, సిపిఓ సత్య నారాయణ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి మధురిమ, పరకాల ఆర్డీఓ నారాయణ, జిల్లా ఇమ్మ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఇఫ్తాకర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ప్రజలకు సత్వర న్యాయం అందేలా పోలిసు అధికారులు, సిబ్బంది పనితీరు ఉండాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివాస్ కార్యక్రమనికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి 19 పిటిషన్లు స్వీకరించి ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా పరిష్కరించాలని ఎస్పి ఆదేశించారు.
భూ తగాదాలు, ఆస్థి తగాదాల విషయంలో చట్ట ప్రకారం, నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూ బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా చూడాలని సూచించారు. ప్రజా దివాస్ ఫిర్యాదులు ఏ మేరకు పరిష్కారం అయ్యాయో రిపోర్ట్ అందించాలని ఎస్పి పేర్కొన్నారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తూనే అసాంఘిక శక్తులు, నేరస్థుల పట్ల కఠిన వైఖరి అవలంభిస్తూ శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడాలన్నారు.
భూవివాదంతో యువకుడు ఆత్మహత్య..
భూవివాదంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఓదెల మండలం జీలకుంటలో జరిగింది. పొత్కపల్లి ఎస్సై అశోక్ రెడ్డి తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన వంగల శ్రీకాంత్రెడ్డి (35) అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు భూ సమస్య విషయంలో బెదిరింపులకు గురిచేశారు. దీంతో మనోవేదన చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తల్లి సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాపడ్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం, అల్లాపూర్ శివారులో గల తెలంగాణ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని సోమవారం హాస్టల్ భవనం పై నుండి కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థిని కింద పడటంతో నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన స్థానిక జహీరాబాద్ లోని ఏరియా ఆసుపత్రికి తరలించరు.
సిద్దిపేట జిల్లాలో మరదలిపై బావ అత్యాచారం చేసిన ఘటన జరిగింది. అక్బర్పేట-భూంపల్లి మండలంలో తమ్ముడి భార్యపై అత్యాచారం చేసిన వ్యక్తిని, అందుకు సహకరించిన అతడి భార్యను అరెస్టు చేసినట్లు దుబ్బాక సీఐ శ్రీనివాస్ తెలిపారు. తమ్ముడికి పెళ్లై నాలుగేళ్లెనా పిల్లలు కాకపోవడంతో మరదలిపై కన్నేశాడు. భార్య సాయంతో అత్యాచారం చేసి వీడియో తీయించాడు. తరచూ భార్యాభర్తలు వేధిస్తున్నరని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ అర్బన్ జిల్లా పరిషత్తు పాలకమండలి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించారని జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. గురువారం జిల్లా పరిషత్ పాలకవర్గం గడువు ముగియనున్న సందర్భంలో ఈరోజు బుధవారం జడ్పీ సీఈవో విద్యాలత అధ్యక్షతన నిర్వహించిన పాలకమండలి ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారి దృష్టికి వచ్చిన సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించారని అన్నారు. జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ ఎలాంటి ఇబ్బందులు రాకుండా జడ్పీ పాలన సాగించారన్నారు.
జిల్లా పరిషత్ చైర్మన్ మారేపల్లి సుధీర్ కుమార్ మాట్లాడుతూ పదవులు వస్తాయి, పోతాయని వాటి గురించి బాధపడాల్సిన పనిలేదని అన్నారు.అలాగే పొగడ్తలకు పొంగిపోవద్దని విమర్శలకు కృంగిపోవద్దని అన్నారు. కష్టాన్ని ఇష్టంతో పనిచేస్తేనే సంతృప్తి ఉంటుందన్నారు.ప్రజా ప్రతినిధులుగా మనం ప్రజలకు ఏమి చేశాం ,చేస్తామనేది పరిశీలన చేసుకోవాలని అన్నారు. తాను ఎంపీపీగా జడ్పీ వైస్ చైర్మన్ గా పనిచేశానని అన్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయడంతోనే ఈ ఐదేళ్ల కాలంలో విజయవంతంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో ముందున్నామని తెలిపారు. ఇందుకుగాను అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ డా. సుధీర్ కుమార్ ను శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు .
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శ్రీరాములు ,అదనపు కలెక్టర్ రాధిక గుప్తా, డి ఆర్ డి ఏ పిడి నాగ పద్మజ,డిఎంహెచ్వో సాంబశివరావు,ఎస్సీ కార్పొరేషన్ ఈడి మాధవి లత, జిల్లా అధికారుల సంఘం అధ్యక్షులు రామ్ రెడ్డి, జడ్పీటీసీలు,ఎంపీపీలు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిలో ప్రజలు అందించిన ఫిర్యాదులను పరిష్కరించే విధంగా వెంటనే చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య జిల్లా అధికారులను ఆదేశించారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రాలను జిల్లా కలెక్టర్ కు అందజేశారు.
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అందిన వినతులను పరిశీలించిన కలెక్టర్ ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజల నుండి 165 ఫిర్యాదులు వచ్చాయి.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, వెంకట్ రెడ్డి, పరకాల, హనుమకొండ ఆర్డీవోలు డాక్టర్ కె.నారాయణ, వెంకటేష్, ఇతర జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;వరంగల్ లో తనను కలవలేకపోయిన క్యాన్సర్ బాధిత బాలుడు మహమ్మద్ అదిల్ అహ్మద్ ఉదంతంపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్పందించారు. తక్షణమే వైద్య సహాయం అందించాలని సీఎంవో అధికారులను ఆయన ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాస్ బాలుడి కుటుంబసభ్యులతో ఫోన్ లో మాట్లాడారు. నెల రోజుల క్రితం అదిల్ అహ్మద్ చికిత్స కోసం బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి కి లక్ష రూపాయల ఎల్వోసీ మంజూరు చేసింది. ప్రస్తుతం అదిల్ అహ్మద్ ఆరోగ్య పరిస్థితి పై వేముల శ్రీనివాస్ ఆరా తీశారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా కావాల్సిన మరింత సాయం అందిస్తామని ఆయన అదిల్ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;విధి నిర్వహణలో మెరుగైన సేవలు అందించే అధికారులకు మంచి గుర్తింపు ఉంటుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ హరి ప్రసాద్ , కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు ల పదవి విరమణ సందర్భంగా జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ అనివార్యమన్నారు. ఎన్నో సవాళ్లతో కూడుకుని వున్న ఉద్యోగం సంపూర్ణంగా చేసి పదవి విరమణ పొందడమే గొప్ప విజయం అన్నారు.ఇంతకాలం సేవలందించగలిగారంటే కుటుంబ సభ్యుల సహకారం కూడా ఎంతో ఉందన్నారు. పదవి విరమణ పొందుతున్న ప్రతి ఉద్యోగి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు.
ఈ అధికారులు సామాన్య కుటుంబంలో జన్మించి అంచలంచలు ఎదిగారు అని ఈ అధికారులను స్ఫూర్తిగా తీసుకుని ఉద్యోగులు పని చెయ్యాలని కోరారు. సీనియర్ అధికారులు జూనియర్ లకు ఏళ్ల వేళలా అండగా నిలవాలని వారి విలువైన సూచనలు సలహాలు అందించాలని అన్నారు. అధికారులు వారికి అప్పజెప్పిన కార్యక్రమాలను సకలం లో సమర్థవంతంగా నిర్వహించారని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాధిక గుప్త (లోకల్ బాడీస్) , వెంకట్ రెడ్డి (రెవెన్యూ) , డి.ఆర్.ఓ గణేష్ , ఆర్.డి.ఓ వెంకటేష్ , జిల్లా అధికారుల సంఘం రాం రెడ్డి , ఎక్సర్సైజ్ శాఖ సూపరింటెండెంట్ చంద్ర శేఖర్ , జిల్లా ఉన్నత అధికారులు , సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లాలోని ధూళిమిట్ట, నంగునూరు మండలాల్లో కొన్ని రోజులుగా ఇసుక అక్రమ దందా జోరుగా సాగుతోందని సోమవారం స్థానికులు ఆరోపించారు. ఇసుక అక్రమ దందాను అడ్డుకోవాల్సిన అధికారుల తీరు తమకేమీ పట్టదన్నట్లు ఉందన్నారు. ధూళిమిట్ట మండలంలోని జాలపల్లి, నంగునూరు మండల కేంద్రంతో పాటు ఖాతా, అక్కెనపల్లి, ఘణపూర్ గ్రామాల్లోని మోయతుమ్మెద వాగు నుంచి పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జూలై 1 నుంచి భారత ప్రభుత్వ నూతన నేరన్యాయ చట్టాలు-2023 అమలులోకి రానున్నట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే పేర్కొన్నారు. ఈ చట్టాల ద్వారా కేసుల దర్యాప్తులో వేగం, బాధితులకు సత్వర న్యాయం లభిస్తాయన్నారు. నూతన చట్టాలపై ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ అధికారులకు, సిబ్బందికి నెల రోజుల పాటు శిక్షణ, అవగాహన కార్యక్రమ ముగింపు కార్యక్రమం నిర్వహించగా ఎస్పి కిరణ్ ఖరే పాల్గొని నూతన చట్టాల నిర్వహణతోపాటు, విచారణలో పాటించవలసిన నూతన విధానాలపై పోలిసు అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పి గారు మాట్లాడుతూ, అమల్లోకి రానున్న కొత్త చట్టాలు మనదేశ అంతర్గత భద్రతలో నూతన శకాన్ని ప్రారంభించనున్నాయని పేర్కొన్నారు. ఈ నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు విధానాలు, విచారణ పద్ధతులలో మార్పు వస్తుందని, ప్రజలకి మరింత సమర్థవంతంగా సత్వర సేవలు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు.
భారత్ స్వతంత్రదేశంగా మారిన తర్వాత కూడా వలస పాలన నాటి న్యాయచట్టాల ప్రకారమే నేరన్యాయ వ్యవస్థ, శాంతి భద్రతల పరిరక్షణ వ్యవస్థ నిర్వహించడం జరుగుతోందని ఎస్పి గుర్తు చేశారు. ఇన్నేళ్లలో భారత న్యాయ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని, అవసరాన్ని బట్టి ప్రజాభద్రత కోసం ఎన్నో చట్టాల రూపకల్పన జరిగిందని పేర్కొన్నారు. ఇప్పుడు అమలులోకి రానున్న నూతన చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం మనదేశ శాంతిభద్రతల పరిరక్షణలో ఒక మైలురాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతన చట్టాల కార్యక్రమ ఇంచార్జీ డిఎస్పి నారాయణ నాయక్, భూపాలపల్లి డిఎస్పీ సంపత్ రావు, రిజర్వు ఇన్స్పెక్టర్లు శ్రీకాంత్, రత్నం జిల్లా పరిధిలోని ఎస్సైలు పోలిసు పోలిసు సిబ్బంది పాల్గొన్నారు.