ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;విధి నిర్వహణలో మెరుగైన సేవలు అందించే అధికారులకు మంచి గుర్తింపు ఉంటుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ హరి ప్రసాద్ , కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు ల పదవి విరమణ సందర్భంగా జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ అనివార్యమన్నారు. ఎన్నో సవాళ్లతో కూడుకుని వున్న ఉద్యోగం సంపూర్ణంగా చేసి పదవి విరమణ పొందడమే గొప్ప విజయం అన్నారు.ఇంతకాలం సేవలందించగలిగారంటే కుటుంబ సభ్యుల సహకారం కూడా ఎంతో ఉందన్నారు. పదవి విరమణ పొందుతున్న ప్రతి ఉద్యోగి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు.
ఈ అధికారులు సామాన్య కుటుంబంలో జన్మించి అంచలంచలు ఎదిగారు అని ఈ అధికారులను స్ఫూర్తిగా తీసుకుని ఉద్యోగులు పని చెయ్యాలని కోరారు. సీనియర్ అధికారులు జూనియర్ లకు ఏళ్ల వేళలా అండగా నిలవాలని వారి విలువైన సూచనలు సలహాలు అందించాలని అన్నారు. అధికారులు వారికి అప్పజెప్పిన కార్యక్రమాలను సకలం లో సమర్థవంతంగా నిర్వహించారని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాధిక గుప్త (లోకల్ బాడీస్) , వెంకట్ రెడ్డి (రెవెన్యూ) , డి.ఆర్.ఓ గణేష్ , ఆర్.డి.ఓ వెంకటేష్ , జిల్లా అధికారుల సంఘం రాం రెడ్డి , ఎక్సర్సైజ్ శాఖ సూపరింటెండెంట్ చంద్ర శేఖర్ , జిల్లా ఉన్నత అధికారులు , సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: