ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;వర్షాకాలంలో డయేరియా ప్రబల కుండా "స్టాఫ్ డయేరియా క్యాంపెయిన్" కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా సంబంధిత అధికారులు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సోమవారం కాన్ఫరెన్స్ హాల్ లో అడిష్ నల్ కలెక్టర్ లు వెంకట్ రెడ్డి, రాధికా గుప్తా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు, సిపిఓ సత్య నారాయణ రెడ్డి ఇతర జిల్లా అధికారులతో కలసి డయేరియా అవగాహన కార్యక్రమాల వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డయేరియా నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు ఆగస్టు 31 వరకు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్య, విద్యా, సంక్షేమ, గ్రామీణ అభివృద్ధి, పురపాలక సంఘాలు, నీటిపారుదల శాఖల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు పకడ్బందీగా చేపట్టాలన్నారు. ప్రతి ఇంటిని సందర్శించి ఐదేళ్లలోపు పిల్లల వివరాలు సేకరించాలని, నీటి విరేచనాల సమస్య ఉన్నట్లయితే ఓఆర్ఎస్ ద్రావణం, వయసు వారిగా జింక్ మాత్రలు, చికిత్స అందించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో, వసతి గృహాల్లో పిల్లలకు భోజనం చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలియజేయాలని, అతిసారా రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిష్ నల్ కలెక్టర్ లు శ్రీ వెంకట్ రెడ్డి, రాధికా గుప్తా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు, సిపిఓ సత్య నారాయణ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి మధురిమ, పరకాల ఆర్డీఓ నారాయణ, జిల్లా ఇమ్మ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఇఫ్తాకర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: