మెదక్ జిల్లా ఆందోల్ నియోజక వర్గం టేక్మాల్ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో ఎస్ఓ బాలమణి విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు.మెడికల్ లీవ్ లో ఉన్నానంటూనే,పాఠశాలకు సంబంచిన రికార్డులను తన సోదరుడి సహాయంతో ఇంటికి తెప్పించుకొని రికార్డులను తారుమారు చేసి,తిరిగి పాఠశాలకు తన సోదరుడితో పాఠశాలకు పంపించారు.నేడు పాఠశాలలో రికార్డులు తిరిగి ఇస్తున్న క్రమంలో విలేకరుల కెమెరాకు చిక్కారు. అతడిని విలేకరులు వివరణ కోరగా ఆమె మా అక్క అని,రికార్డులకు సంబంధించన విషయంలో పొంతన లేని సమాధానం చెప్పి తప్పించుకున్నాడు.అతను ఎవరని పరిశీలించగా పెద్ద శంకరంపేట్ మండలం బుజరంపల్లి గ్రామంలో హరిజన వాడ ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహించే విజయ్ గా గుర్తించారు..అక్క కోసం తమ్ముడు ఇలాంటి పనులు చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.దీని వెనక ఉన్న అధికారులపై ఉన్నతాధికారులు ఎస్ఓ పై, ఆమె సోదరుడు విజయ్ పై సమగ్ర విచారణ జరిపి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లి తండ్రులు డిమాండ్ చేస్తున్నారు..
Post A Comment: