మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయుటకు చర్యలు తీసుకోవాలని కమిటీకి విజ్ఞప్తి చేసిన అధ్యక్షులు యాదగిరి సత్తయ్య

 హైదరాబాద్ లో స్టాండింగ్ కమిటీ ఆన్  లేబర్ టెక్స్ టైల్స్ అండ్ స్కిల్స్, డెవలప్ మెంట్ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో సింగరేణి కోల్ మైన్స్ కాంట్రాక్ట్ మజ్దూర్ సంఘ్ బిఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య పాల్గొని మాట్లాడుతు సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కోల్ ఇండియా మాదిరిగా హై పవర్ కమిటీ వేతనాలు చెల్లించుటకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినారు స్పందించిన పార్లమెంటరీ కమిటీ సింగరేణి యాజమాన్యంతో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపినారు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, సుమారు 25వేల నుండి 30 వేల మంది కాంటాక్ట్ కార్మికుల పనిచేస్తున్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థ పరంగా కాంట్రాక్ట్ కార్మికులకు జరుగుతున్న శ్రమ దోపిడిని కమిటీ దృష్టికి తీసుకుపోయామని నేషనల్ హాలిడేస్, వేతనంతో కూడిన లివులు, సిక్ లీవ్, సింగరేణి కార్మికుల మాదిరిగా కాంట్రాక్ట్ కార్మికులకు కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయం కల్పించుటకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినారు, కాంట్రాక్ట్ కార్మికులకు ఇంటి సదుపాయం క్వార్టర్ అలాట్ మెంట్ సదుపాయం కల్పించాలని, తదితర సమస్యలను పరిష్కరించాలని కమిటీకి విజ్ఞప్తి చేసినారు పాల్గొన్న సింగరేణి కోల్ మైన్స్ కాంట్రాక్ట్ మజ్దూర్ సంఘ్ బిఎంఎస్ ప్రధాన కార్యదర్శి ఇనపనూరి నాగేశ్వరరావు, కేంద్ర ఉపాధ్యక్షులు దొడ్డి నిర్మల, బండారి శ్యాంసుందర్, కేంద్ర కార్యదర్శి గుండబోయిన భూమయ్య, కేంద్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చెన్నూరి రమేష్, గొడుగు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: