మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: మారుమూల అటవీ మండలాల్లో భారీ వర్షాలతో గత ఏడాది గండ్లు పడిన చెరువులు, ప్రాజెక్టుల పనులను పూర్తి చేయకుండానే, ప్రాజెక్టు వద్ద సంబరాలు ఎలా చేస్తారని, దీనికి సీఎం, రాష్ట్ర మంత్రులు సమాధానమివ్వాలని ఏఐసిసి కార్యదర్శి, మాజీ మంత్రి, మంథని శాసనసభ్యులు శ్రీధర్ బాబు ప్రశ్నించారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహాదేవపూర్ మండలం, బొమ్మాపూర్ లోని గండిపడిన వెంకటేశ్వర మందిర చెరువును రైతులతో కలిసి పరిశీలించారు.*
*కాటారం, మహాముత్తారం, మహాదేవపూర్, పలిమెల, మలహర్ మండలాల్లో సుమారు 16 చెరువులు గండ్లు పడినప్పటికీ, ఏ ఒక్క చెరువు గండి పనులు పూర్తి చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని శ్రీధర్ బాబు ఆరోపించారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో శివశంకర్ ప్రాజెక్టు చెరువు కు గండి పడి మూడు పంటలను రైతులు కోల్పోయారని, రిపేరు చేయాలని అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించినప్పటికీ పనులు నేటి వరకు కూడా పూర్తి చేయలేదని తెలిపారు. చెరువుల పనులు పూర్తి చేయకుండానే నీటి ఉత్సవాలు, చెరువుల సంబరాలు ఎలా నిర్వహిస్తారని అన్నారు. నారం ప్రాజెక్టులో నేటి దినోత్సవం సంబరాలకు విచ్చేస్తున్న మంత్రులు అధికారులు రైతులకు సమాధానం ఇవ్వాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.*
*మంత్రులు ఈ ప్రాంత పర్యటనకు వస్తుండటం సంతోషమని, ఈ ప్రాంతానికి సంబంధించిన ఎన్నో సమస్యలు, ఎన్నో సార్లు ప్రస్తావించిన ప్పటికీ పరిష్కరించ పోవడం పట్ల శ్రీధర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు మా హయాంలో పూర్తి చేయనప్పటికీ, ఇప్పుడు పూర్తి చేయాలని అసెంబ్లీలో కోరడం, సీఎం ఇచ్చిన హామీని తాను నెరవేర్చకపోవడం ఏమిటని శ్రీధర్ బాబు ప్రశ్నించారు.*
*వర్షాకాలం ప్రారంభం ముందు 15 రోజులలో యుద్ధ ప్రాతిపదిక పైన గండ్లు పడిన చెరువులన్నింటి పనులను త్వరగా పూర్తి చేయాలని శ్రీధర్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.*


Post A Comment: