మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం నియోజకవర్గం పరిధిలోని 8వ కాలనీ కీ చెందిన చాట్ల స్వర్ణలత అనే యువతిని తన దూరపు బంధువైన సలిగంటి రమేష్ అనే యువకుడు గత రెండు సంవత్సరాల క్రితం యువతి అంటే తనకీ ఇష్టమని తనకు తెలుపగా మొదట్లో యువతి నిరాకరించగా మరల తన వెంట పడి వారి ఇంటికి వచ్చి యువతి అమ్మ నాన్నలకు పెళ్ళి చేసుకుంటానని నమ్మబలికి ఒప్పించడంతో యువతి కూడా సరేనని ఒప్పుకుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం మొదలై కొన్ని రోజులు గడిచాయి. ఈ నేపథ్యంలోనే సదరు యువకుడు యువతి వాళ్ళ బంధవులతో స్వర్ణలత నేను పెళ్లి చేసుకుకోబోతున్నమని చెప్పి ప్రచారం చేశాడు. అలా కొద్ది రోజుల తర్వాత ఇంతలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆ యువకుడు రెండు నెలలుగా కనిపించకుండా పోయాడు. దీంతో యువతికీ ఏం చేయని దీన స్థితిలో ఉండిపోయింది. మళ్లీ గత నాలుగు రోజుల క్రితం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటా అనిన సదరు యువకుడు వేరే మరో యువతితో పెళ్లికి సిద్ధమైనట్టు తెలుసుకున్న యువతి మనస్థాపానికి గురై గోదావరి నదిలో దూకి హత్యయత్నం చేసుకునే ప్రయత్నం చేయగా అక్కడే ప్రహార కాస్తున్న రివర్ పోలీసులు యువతి ఆత్మయత్నాన్ని భంగం చేసి యువతికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం యువతి వాళ్ళ అక్క అయిన కోమలత కీ ఫోన్ చేసి సంఘటన స్థలానికి పిలిపించి యువతిని అప్పగించి 8వ కాలనీ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాధు ఇచ్చినట్టైతే మీకు న్యాయం జరుగుతుందనీ నచ్చజెప్పి పంపించారు.

Post A Comment: