రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అఖిల భారత రైతుకూలీ సంఘం( ఏ ఐ కె యమ్ ఎస్)......... సిపిఐ మావోయిస్టు నాయకుడు కటకం సుదర్శన్ మరణం భారత విప్లవోద్యమానికి తీరని లోటు.కామ్రేడ్ సుదర్శన్ మరణం పట్లఅఖిల భారత రైతుకూలీ సంఘం (ఏ ఐ కె యమ్ ఎస్ )విచారం వ్యక్తం చేస్తుంది. సుదర్శన్ కుటుంబానికి మావోయిస్టు పార్టీ శ్రేణులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తుంది. దేశంలో ఆఫరెషన్గ్రీన్హంట్, ప్రహర్ సమాధాన్ ల పేరుతొ కేంద్రం దాడులు చేస్తు విప్లవోద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నది. మరోపక్క హిందుత్వం ముసుగులో మైనార్టీలపై ఆదివాసులపై దాడులు చేస్తు హంతక పాలన కొనసాగిస్తుంది.రాష్ట్రములో కెసిఆర్ కూడా మోడీ అమిత్ షా బాటలోనే పయనిస్తూ ప్రజాస్వామిక వాదులను, పౌర హక్కులను హరిస్తూనాడు. దేశంలో రాష్ట్రంలో పౌర, ప్రజాస్వామిక హక్కులకు రక్షణ లేదు. ప్రశ్నించిన వారిని జైళ్ళల్లో బంధీస్తూ నియంత పాలన సాగిస్తున్నారు. మొత్తంగా భారత విప్లవోద్యమాలపై సామ్రాజ్యవాదా శక్తుల కుట్రలను చిత్తు చేస్తు ప్రజాయుద్ధ పంధాలో పురోగమిస్తున్న తరుణంలో కామ్రేడ్ కటకం సుదర్శన్ @ఆనందన్న @దూల అనారోగ్యం తో మృతి చెందడం బాధాకరం... కామ్రేడ్ సుదర్శన్ ఆశయలను కొన సాగిద్దామని ప్రతినబునుదాం. భారతవిప్లవోద్యమంలో కామ్రేడ్ సుదర్శన్ చిరంజీవి.. విప్లవభి వందనలతో వెల్తురు సదానందం (ఏ ఐ కె యమ్ ఎస్ రాష్ట్ర నాయకులు), మేరుగు చంద్రయ్య (ఏ ఐ కె యమ్ ఎస్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు )

Post A Comment: