మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం కార్పొరేషన్ పరది 25 వ డివిజన్ గాంధీనగర్ కు చెందినబావు లక్ష్మీ రాజయ్య దంపతుల కుమార్తె కోమలత వివాహం ఈనెల7వ తేదిన జరగనుండగా వధువు తల్లిదండ్రులు కోమలత పెళ్లి ఖర్చులకు ఇబ్బందులు పడుతున్నా విషయాన్ని దాతల సహాయం కోరుతూ సోషల్ మీడియాలో పోస్టు చేసి అభ్యర్థించగా ఆ పోస్టు కు స్పందించిన సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ గాంధీనగర్ లోని వధువు ఇంటి దగ్గరకు వెళ్లి నిత్యావసర సరుకులు అందజేశారు అనంతరం మల్లేష్ మాట్లాడుతూ అమ్మాయి తల్లిదండ్రులు దాతల సహాయం కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా మేం వారి ఫొన్ నంబర్ కు ఫొన్ చేసి వారి పరిస్థితిని.ఫొన్ ద్వారా తెలుసుకొని వారికి నిత్యావసర సరుకుల కొరత ఉందని మాకు తెల్పగానే సేవా స్పూర్తి ఫౌండేషన్ సభ్యులు అమెరికా లో ఎం బి బి స్ చుదువుతున్న బాకం వార్షిణి సహకారంతో సోమవారం రోజున కోమలత ఇంటి దగ్గరకు వెళ్లి నిత్యావసర సరుకులను అందజేశామని ఈ అమ్మాయి పెళ్లి గురించి తెల్పగానే వెంటనే స్పందించి సహకారం అందించిన ఫౌండేషన్ సభ్యులు బాకం వార్షిణి వధువు కోమలత కుటుంబం తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని నేను గత ఏడాది లో ఫౌండేషన్ స్థాపించిన విషయం తెలిసిందే అ రోజు నుండి ఈరోజు వరకు నేను చేసే ప్రతి సేవా కార్యక్రమాల్లో వార్షిణి తండ్రి ఫౌండేషన్ కు అందిస్తున్న సహాయ సహకారం ద్వారా అనేక మంది నిరుపేదల ఆకలి.మరియు వారి అవసరాలు తిరుస్తున్నామని వారి యొక్క దాతృత్వం మరువలేనిదని మల్లేష్ గుర్తు చేశారు.కోమలత వివాహానికి మరికొంతమంది దాతలు కూడా ముందుకు వచ్చి సహాయం అందజేయాలని మల్లేష్ కోరారు.నూతన దంపతులను ఆశీర్వదించారు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో పిల్ల పాపలతో నిండు నూరేళ్ల వర్ధిల్లాలని మనసు పూర్తిగా ఆ భగవంతుని వేడుకుంటున్నానని అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ అన్నారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు జుల వినయ్.పయుమ్ తదితరులు పాల్గొన్నారు

Post A Comment: