మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సోనియా గాంధీ సారథ్యంలో
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు వారికి ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపేందుకు స్థానిక రీగల్ షూమార్ట్ వద్ద గల డివైడర్ మధ్యలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసే గద్దెను నిర్మించగా,
విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే హుటాహుటిన బల్దియా కమీషనర్ కు ఆదేశాలు ఇవ్వగా వారు, సిబ్బందితో పాటు సంఘటన స్థలానికి చేరుకుని జెండా గద్దెను కూల్చివేయగా,
కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకొని నిరసన వ్యక్తపరచడమే కాక ఫోన్ కాల్ లో కమీషనర్ ను సంప్రదించగా ఇంకా అందుబాటులోకి రాలేదని అన్నారు..
ఈ సందర్భమున వారు మీడియాతో మాట్లాడుతూ,,
కాంగ్రెస్ పార్టీ జెండా గద్దెను నిర్మించి ప్రజల పక్షాన తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ కి కృతజ్ఞతలు తెలపాలనుకుంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఎమ్మేల్యే బల్దియా అధికారులతో జెండా గద్దెను కూలగొట్టడం హేయమైన చర్య అని,
కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మేల్యే కమీషనర్ చర్యలను ఖండిస్తున్నామని, వారు చేస్తున్న ఇలాంటి అనైతిక చర్యలను ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని,,
రానున్న రోజుల్లో ఈ అహంకార, అసమర్థ ఎమ్మేల్యేను చిత్తుగా ఓడించాలని ప్రజలందరికీ పిలుపునిచ్చారు..
ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..
Post A Comment: