మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

డీసీసీ అధ్యక్షులు, రామగుండం నియోజక వర్గ ఇంచార్జి  మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ నాయకత్వoలో కాంగ్రెస్ పార్టీ మునుపెన్నడు లేని విధంగా రోజు రోజుకు మరింతగా బలపడుతూ నిత్యం భారీ చేరికలతో ప్రజా క్షేత్రంలో తారాజువ్వలా దూసుకెళ్తూ అశేషమైన ప్రజల మద్దతు కూడగట్టుకుంటూ అహర్నిశలు నియోజక వర్గ ప్రజానీకానికి పనులు చేసిపెడుతూ జనహితమే నా జీవితం అని నమ్మి అలుపెరగని బాటసారిగా ప్రజా సమస్యలకై పోరాటం చేస్తున్న దమ్మున్న నాయకుడు రాజ్ ఠాగూర్ నాయకత్వంలో

 తక్కలపల్లి సర్పంచ్ ముక్కెర శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాలకుర్తి మండల రైతులు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.  ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ అకాల వర్షాలకు ఐకేపీ సెంటర్స్ లో అరబోసిన వరి దాన్యాం తడిసిన మోకాళ్ళొతూ నీళ్లలో నానీ మొలకలోస్తే అధికార పార్టీ నాయకులు గాని స్థానిక ఎమ్మెల్యే గాని పరామర్శించిన పాపాన పోలేదు, *కానీ అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యం తడిసి రైతు కలత చెందుతున్నాడని తక్షణమే అంతరగ్రామ్, పాలకుర్తి మండల కేంద్రాల్లో పలు గ్రామాల రైతులకు భరోసా కల్పిస్తూ జిల్లా కలెక్టర్ తో మాట్లాడి తడిసిన ధాన్యమైన రంగు మారిన ధాన్యమైన ఎలాంటి తరుగు లేకుండా బేషరుతుగా కొనాలని సూచించిన మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఇవ్వాళా మేమంతా ఆయనకు ప్రజల పట్ల ఉన్న నిబద్ధత తోనే మేమంతా ఇవ్వాళా ఆయన వెంట నడవడానికి సిద్దమై ఆయన గెలుపు కోసం మేము సైతం ఆయన గెలుపు బాటలో పనిచేస్తామని తెలియజేసారు.

 ఈ కార్యక్రమంలో చేరికైనా రైతులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచ్ ముక్కెర శ్రీనివాస్ మాజీఎంపీపీ ఉరుమెట్ల రాజలింగం, బీసీ సెల్ అధ్యక్షులు పెండ్యాల మహేష్,మండల యువజన అధ్యక్షులు ఓల్లెపు సాయి,పల్లికొండ రాజేష్, మేడి ఓదెలు కునారపు ప్రేమ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: