ఎన్ టి పి సిలో సిపిఐఎంఎల్ ప్రజాపంథా పెద్దపెల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహోపాధ్యాయులు కారల్ మార్క్స్ జయంతి, అరుణోదయ రామారావు నాలుగో వర్ధంతి సభ జరిగింది. *ఈ సభలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంధా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్, సహాయ కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, పెద్దపెల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్ హాజరై మాట్లాడారు. ప్రపంచ ప్రజలకు పెట్టుబడిదారీ గ్రంధాన్ని రచించి పరిచయం చేసిన గొప్ప కమ్యూనిస్టు విప్లవకారుడు మేధావి కారల్ మార్క్స్ జయంతి సభ జరుపుకోవడం అంటేనే మార్క్స్ కలలు కన్నా సమాజం కోసం పోరాడడం. నేడు పెట్టుబడిదారులంతా సమాజ సంపదనంతా కష్టజీవులకు శ్రమజీవులకు పంచకుండా ఒకే చోట కేంద్రీకృతం చేసి సమసమానత్వం రాకుండా చేస్తున్న పరిస్థితి ఉన్నది. పాలకులు కూడా పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఉద్యమాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉన్నది.
కళ కళల కోసం కాదు కళ ప్రజల కోసమని పాటనే తన ప్రాణంగా భావించి లేదా పేద బడుగు బలహీన వర్గాల బాధలను గాధలను పాట రూపంలో గొంతు విప్పి ప్రజలను చైతన్యవంతం చేసి పోరాటానికి ఊపిరి ఊదిన కామ్రేడ్ అరుణోదయ రామారావు లేని లోటు పూడ్చలేనిది. కామ్రేడ్ రామారావు కు రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి ఎంతో అనుబంధం ఉన్నది. మే ఒకటవ తేదీన రామగుండంలో జరిగిన కార్యక్రమానికి హాజరై తన ఆటపాటలతో చైతన్యం చేసి నాలుగు రోజుల తర్వాత గుండెపోటుతో అమరత్వాన్ని పొందడం ఇక్కడి ప్రజలను తీవ్రంగా కలిసి వేసింది. తన ఊపిరి ఉన్నంతవరకు పాటనే తన ప్రాణంగా భావించాడు.
నేడు పాట దొరల గదిలో బందీలుగా మారిన పరిస్థితి ఉన్నది. కళాకారులంతా ప్రభుత్వ అనుకూల విధానాలను అనుసరిస్తూ ప్రభుత్వం చేతుల్లో బంధీలుగా మారి ప్రజా సమస్యలపై గొంతు లేకుండా చేస్తున్న పరిస్థితి ఉన్నది. నిజమైన కళాకారులంతా అరుణోదయ రామారావు ను స్ఫూర్తిగా తీసుకొని ప్రజా సమస్యలపై గళం విప్పాలని ప్రభుత్వ గడీల నుంచి బయటికి వచ్చి ఉద్యమించాలని ప్రజల కోసం గొంతు విప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అప్పుడే రామారావు గారికి నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు. *ఇంకా ఈ సభలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంధా జిల్లా నాయకులు గుమ్మడి వెంకన్న, ఆడెపు శంకర్, గొల్లపల్లి చంద్రయ్య, కోడిపుంజుల లక్ష్మి, కట్ట తేజేశ్వర్, తీగుట్ల రాములు, కలవల రాయమల్లు, ఏ మల్లయ్య, బత్తుల రాజయ్య, పి సికిందర్ లతోపాటు కార్మికులు పాల్గొన్నారు.

Post A Comment: