పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న

       


                                                            పెద్దపల్లి:మే:4:పంచాయితీ రాజ్ శాఖ కు అవార్డులు సరే...ఔట్ సోర్సింగ్ పంచాయితీ కార్యదర్శుల క్రమ బద్దీకరణ ఎప్పుడో అంటూ హన్మకొండ ఏకశిలా పార్కు ఆవరణ లో  గ్రామ పంచాయితీ కార్యదర్శుల(జేపీఎస్),ఓపీఎస్ లను రెగ్యులరైజేశన్ చేయాలని గత ఆరు రోజులుగా నిరవధిక దీక్ష కి కూర్చున్న ఔట్ సోర్సింగ్ కార్మికులకు మద్దతు తెలిపిన అఖిల భారత మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు కేడల ప్రసాద్,ఈ సందర్భంగా వారు మాట్లాడారు,తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2018 లో సుమారు 9500 మంది నిరుద్యోగులను కాంట్రాక్టు పద్ధతిన ఔట్ సోర్సింగ్ కార్మికులుగా పంచాయితీ కార్యదర్షులుగా పరీక్షలు నిర్వహించి,ఇంటర్వ్యూ చేసి,రోస్టర్ పాయింట్ల ఆధారంగా అర్హులైన వారిని నియమించుకోవడం జరిగింది... కానీ 6 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు రెగ్యులరైజేశన్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఇందులో కొంత మంది అనివార్య కారణాల వల్ల ఉద్యోగo చేయకుండా ఉన్నారని,గత మూడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వకుండా చేసిన ఉద్యోగాలు వదిలి వెళ్లితే మళ్ళీ కొత్త నియామకాల పేరుతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను ప్రజా ప్రతినిధులు అమ్ముకోవాలని చూస్తున్నారని,అన్ని అర్హతలతో నియామకం అయిన వీరిని వెంటనే క్రమ బద్దీకరించి పేస్కేల్ పొందే ఉధ్యోగులుగా గుర్తించాలని తెలిపారు,వీరి సేవల్ని ఉపయోగించుకొని పంచాయితీ రాజ్ శాఖ కేంద్రo నుండి జాతీయ అవార్డులను పొందింది,అనీ పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే పరిష్కరించేలా కృషి చేయాలని ప్రసాద్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఉద్యోగస్తులు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు...

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: