మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
తధాగత గౌతమ బుద్ధుని 2567వ జయంతి కార్యక్రమాన్ని, పురస్కరించుకొని పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో, *ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయిస్ సెక్రటరీ దోమ్మటి సది, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు భూషిపాక సంతోష్ మహారాజ్ గార్ల ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పూలమాలేసి, పంచశీల జెండా ఎగరవేయడం జరిగింది, మరియు ఎలిగెడు మండలం ధులికట్ట బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత,ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు భూషిపాక సంతోష్ మహారాజ్ మాట్లాడుతూ మన దేశమే కాదు.. ఆసియా దేశాలన్నీ ఈ శుభదినం కోసం కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్నాయి .. కారణం ఈ రోజు బుద్ధ భగవానుడి జయంతి.. అదే బుద్ధ పూర్ణిమ! ప్రపంచ మానవాళి దు:ఖానికి కారణం కనుగొన్న బుద్ధుడు నడయాడిన దేశం మనది! నాలుగు ఆర్య సత్యాలను బోధించిన గౌతముడి పాదస్పర్శతో పావనమైన దేశం మనది! బౌద్ధమత వృక్షం పల్లవించిన పవిత్ర ప్రదేశం మనది! బుద్ధ పూర్ణిమ అంటే మానవాళికి ఓ మార్గనిర్దేశం చేసిన బుద్ధ భగవానుడు జన్మించిన రోజు! అహింసో పరమోధర్మ అని చాటి చెప్పిన మహనీయుడు.. మహాబోధి నీడలోన మహిమ గనిన గౌతముడు ఆయన! అన్ని దేశాల్లో అందరిలో ప్రసిద్ధుడాయన! వైశాఖ శుద్ధపూర్ణిమ రోజున లుంబినిలో బద్ధభగవానుడు జన్మించాడని అంటారు.. ఆయన మహాబోధి వృక్షం కి జ్ఞానోదయాన్ని పొందింది క్రీస్తుపూర్వం 588లో.. గౌతముడికి జ్ఞానోదయం అయిన రోజు.. బుద్ధగయలో ఆయన నిర్వాణం.. కుషి నగరంలో ఆయన పరినిర్వాణం జరిగిన సందర్భాలను పురస్కరించుకుని కూడా బౌద్ధ పౌర్ణిమను పాటిస్తారు కొందరు. బుద్ధపూర్ణిమను వివిధ దేశాలలో వివిధ పేర్లతో పిలుచుకుంటారు.. పేర్లు ఎలా ఉన్నా.. ఈ పవిత్రమైన రోజున బౌద్ధులంతా ప్రశాంత మనసుతో.. ఆ తథాగతుడి బోధనలు తల్చుకుంటారు. బౌద్ధ ఆరామాలను సందర్శిస్తారు. బౌద్ధ భిక్షువులకు అన్నపానీయాలను అందచేస్తారు. బుద్ధుడి విగ్రహాల ముందు దీపాలు, అగరొత్తులు వెలిగిస్తారు. పూలమాలలు సమర్పిస్తారు.అని అన్నారు ఈ కార్యక్రమంలో *కుల వివక్ష పోరాట సమితి పెద్దపెల్లి జిల్లా కార్యదర్శి కళ్ళపల్లి అశోక్, మోదం పల్లి శ్రావణ్ జిల్లా ప్రెసిడెంట్, దామ సది ముదిరాజ్, దామ నవీన్ ముదిరాజ్, పుల్లూరు వెంకటేష్ మహారాజ్, కుమ్మరి నవీన్, రాజు, తదితరులు పాల్గొన్నారు

Post A Comment: