మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 






పెద్దపల్లి జిల్లా కేంద్రంలో  జరిగిన సమావేశంలో తెలంగాణ వికలాంగుల వేదిక రాష్ట్ర వ్యవస్థాపకులు మేకల సమ్మయ్య రాష్ట్ర అధ్యక్షుడు సుతారి రమేష్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో ఉన్న దివ్యాంగుల సమస్యలు పరిష్కరించట్లేదని జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయిలో ఉన్న అధికారులు చూసి చూడనట్టు దివ్యాంగుల సమస్యలు పరిష్కరించకుండా ఎన్నోసార్లు కలెక్టర్ ఆఫీస్ లో దరఖాస్తులు చేసినా కూడా కలెక్టర్  కూడా చూసి చూడనట్టు ఉంటున్నారు జిల్లా స్థాయిలోనే ఒక దివ్యాంగునికి అవమానం జరుగుతుంది ఇక గ్రామస్థాయిలో ఎలాగ ఉంటుందో సోదరులు అందరూ  ఆలోచించాలి 33 జిల్లాలలో కలెక్టరేట్ వెళ్లిన దివ్యాంగుల పరిస్థితి గోరాతి ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఎక్కడ చూసినా ఏ జిల్లా చూసినా దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు. స్వయం ఉపాధి చేసుకున్న వాళ్లకు త్రీ వీలర్ వెహికల్ ఇవ్వాలని బ్యాంకు తో సంబంధం లేకుండా లోన్స్ మంజూరు చేయాలని అలాగే ఐదు శాతం రిజర్వేషన్ కలిగి ఉన్న దివ్యాంగులకు డబల్ బెడ్ రూమ్ మొదటి ప్రాధాతన ఇవ్వాలని అలాగే ప్రతి నెల 5వ తేదీ నుంచి పదో తేదీ వరకు పింఛను మంజూరు చేయాలని అలాగే వికలాంగులపై జిల్లాలలో దాడులు జరుగుతున్నాయి జిల్లాస్థాయి పోలీస్ అధికారులు గానీ తక్షణమే స్పందించి దివ్యాంగులకు 2016 చట్టం అమలు చేసి నిందితుని కఠినంగా శిక్షిస్తారని అలాగే దివ్యంగుల బంధు కూడా ఇవ్వాలని అలాగే ముఖ్యంగా వివిధ శాఖలో ఉన్న అధికారులు గానీ చిన్నచూపు చూడకుండా తగిన న్యాయం  చేయాలని లేనియెడల వివిధ కార్యాలయం వద్ద ధర్నా చేయడానికి మేము సిద్ధపడతామని ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో టివివి తెలంగాణ వికలాంగుల వేదిక': పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు. ఎల్లయ్య గౌడ్ .    పెద్దపెల్లి జిల్లా అధ్యక్షురాలు:. హుమెరా బేగం .  ప్రచార కార్యదర్శి: చిలుముల. సంపత్ . కోశాధికారి: శ్రీను . & మండల అధ్యక్షుడు. పాలకుర్తి మండల అధ్యక్షుడుశంకర్ . రామగుండం మండల అధ్యక్షుడు కల్లూకోట రాజేందర్ . అంతర్గాం మండల అధ్యక్షురాలు. రాజేశ్వరి జిల్లాలోని దివ్యాంగులు పాల్గొన్నారు



Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: