ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జిల్లాలో షి టీమ్స్ తో మహిళలకు, విద్యార్థులకు, బాలికలకు భరోసా కల్పిస్తున్నామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో షీ టీమ్స్ వాల్ పోస్టర్లను అదనపు ఎస్పీలతో కలిసి ఎస్పి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ షీ టీమ్స్ మహిళలు బాలికలు విద్యార్థుల రక్షణ కోసం నిరంతరం పనిచేస్తుందని,
మహిళల భద్రత కై ఏర్పడిన జిల్లా లో షీటీం ఏర్పాటు నుండి ఇప్పటివరకు 200 పైగా అవగాహన కార్యక్రమాలు చేయడం జరింగిందని, దాదాపుగా 1000 కి పైగా హాట్స్పాట్ గస్తీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే దాదాపు 20 కేసులు నమోదుతో పాటు 20 పైగా ఈవ్ టిజర్లకు కౌన్సిలింగ్ కండక్టు చేయడమైనదని వెల్లడించారు.
మహిళలు, పిల్లల నుండి మొదలుకొని పెద్దవారి వరకు తరచుగా ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు అయినట్టి ఈవ్ టీజింగ్, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడం, ప్రేమ పేరుతో మోసం , వెంబడిచడం , ఫోన్ చేయడాలు, అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు, సందేశాలు పంపడం, విద్యాసంస్థలకు, ఉద్యోగాలకు మరియు ఇతర పనుల మీద బయటకు వెళ్తున్నపుడు ఇబ్బందులు కలిగించడం వంటి చర్యలకు పాల్పడిన వ్యక్తుల పైన చట్ట పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పి హెచ్చరించారు. ఎలాంటి ఇబ్బందులకు గురైన వెంటనే 8712658162 షీటీం కి గానీ స్థానిక పోలీసులకు గానీ సమాచారం ఇవ్వాలని ఎస్పి సురేందర్ రెడ్డి కోరారు. షీటీం కి సమాచారం ఇచ్చిన వ్యక్తుల పేర్లు మరియు బాధితుల పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఎస్పి తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి అడ్మిన్, వి. శ్రీనివాసులు, అదనపు ఎస్పీ ఏఆర్ వి. శ్రీనివాస్, షీ టీమ్ ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్, ఎస్సై శ్రీలత పాల్గొన్నారు.
Post A Comment: