మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అమితమైన ప్రేమ అమ్మ.. అంతులేని అనురాగం అమ్మ..అలుపెరుగని ఓర్పు అమ్మ.. అద్భుతమైన స్నేహం అమ్మస్థానిక రామగుండంలోని క్రియేటివ్ ట్యుటోరియల్స్ నందు విద్యార్థిని విద్యార్థులకు*మదర్స్ డే
సందర్భంగా వ్యాసరచన పోటీలు మాస్టర్ కన్నూరి లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది
నేటి విద్యా విధానంలో అమ్మ అనే పదం ఎంత ఉన్నతమైనదో ఎంత గొప్పదో ఎంత విలువైనదో విద్యార్థిని విద్యార్థులు చక్కగా విషదీకరించి అద్భుతంగా రాశారు
ప్రథమ బహుమతి శిజా తొమ్మిదవ తరగతి లిటిల్ సిటిజన్ స్కూల్.
ద్వితీయ బహుమతి సుశాంత్ కె వి స్కూల్
వీరికి పిటీ డబ్ల్యూఏ అధ్యక్షులు కేఎస్ నందు బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి సమాజంలో అమ్మ చాలా గొప్పది అమ్మలను గౌరవిస్తూ విద్యార్థిని విద్యార్థులు మంచి అవగాహనతో వ్యాసరచన పోటీలో పాల్గొన్నందుకు వారందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ ఇక ముందు కూడా పెద్దల పట్ల గౌరవం కలిగి ఉంటూ ముందుకు అభివృద్ధి చెందుతూ సాగాలని వారు కోరారు
ఇలాంటి మోరల్ వాల్యూస్ విద్యార్థినీ విద్యార్థులు తెలియచేస్తున్నందుకు గ్రేట్ ట్యుటోరియల్స్ లక్ష్మణరావు కు అభినందనలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
Post A Comment: