మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సామాజిక కార్యకర్త బీజేపీ నాయకుడు నిమ్మరాజుల రవి ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ ఆయుస్మాన్ భారత్ కార్డుల నమోదు కార్యక్రమం లింగాపూర్ గ్రామం లో నిర్వహించారు నిమ్మరాజుల రవి మాట్లాడుతూ మీ సేవా కు వెళ్ళడానికి ప్రజల ఇబ్బంది పడుతారని అందుకే గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఇక్కడ క్యాంపు నిర్వహించడం జరిగిందని అన్నారు . దాదాపు 1300పైగా వ్యాధులకు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య శ్రీ హెల్తు కార్డ్ వర్తించుతుందని అన్నారు. కావున నాలుగు రోజుల పాటు జరిగే ఈ క్యాంపు ను గ్రామప్రజలు అందరు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని కోరారు. ఈ కార్యక్రమంలో కన్నం మోహన్ పులి శ్రీనివాస్ ఓరం లవకుమార్ గుర్రం రాజలింగు పాల్గొన్నారు

Post A Comment: