మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
SCCWU IFTU ఆధ్వర్యంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పని వేళలను వేసవి ఎండల దృశ్య మార్పు చేయాలని గోదావరిఖని జిఎం కార్యాలయంలో పర్సనల్ అధికారి సలీం కు వినతిపత్రం సమర్పించడం జరిగింది. రోజురోజుకు విపరీతంగా ఎండలు పెరుగుతుండడంతో రోడ్లపై పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులంతా విపరీతంగా అనారోగ్యం పాలవుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా సింగరేణి యాజమాన్యం వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మార్చుతూ వస్తున్నది. ప్రతి సంవత్సరము లాగానే ఈ సంవత్సరం కూడా వేసవి ఎండల్లో దృష్టిలో పెట్టుకొని పని వేళలు మార్చి ఆరోగ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. *ఇంకా ఈ కార్యక్రమంలో SCCWU IFTU రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తోకల రమేష్, CPI ML ప్రజాపంధా జిల్లా కన్వీనర్ గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, జిల్లా నాయకులు జూపాక శ్రీనివాస్ గుమ్మడి వెంకన్న, SCCWU IFTU ఆర్ జీ వన్ అధ్యక్షులు కొయ్యడ శంకర్, వాసుదేవ రెడ్డి, ఎం సమ్మయ్య పాల్గొన్నారు.

Post A Comment: